అచ్చుగుద్దినట్టు జగన్‌ను అనుకరించిన రఘురామ

ABN , First Publish Date - 2021-04-12T19:53:40+05:30 IST

ఇప్పటి వరకు ప్రభుత్వ తప్పొప్పులను ఎత్తిచూపుతూ... తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు...

అచ్చుగుద్దినట్టు జగన్‌ను అనుకరించిన రఘురామ

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ప్రభుత్వ తప్పొప్పులను ఎత్తిచూపుతూ... తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు... ఈసారి ఏకంగా సీఎం జగన్ రెడ్డిని అనుకరిస్తూ నవ్వులు పూయించారు. అచ్చుగుద్దినట్టు జగన్‌ను దించిపడేశారు. సీఎం జగన్ మైక్ పట్టుకుని మాట్లాడితే ఎలా ఉంటుందో చేసి చూపించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చును విమర్శిస్తూ సీఎం జగన్‌ను రఘురామ అనుకరించారు. ఎంపీ రఘురామకృష్ణ రాజు విశ్వరూపం అదుర్స్ అంటున్నారు నెటిజన్లు. 

Updated Date - 2021-04-12T19:53:40+05:30 IST