వైసీపీకి షాక్‌

ABN , First Publish Date - 2021-02-22T07:44:16+05:30 IST

తుది విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన అమలాపురం డివిజన్‌ పరిధిలో ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీకి గట్టి షాక్‌నిచ్చాయి. అధిష్ఠాన నిర్ణయాలతో సంబంధం లేకుండా టీడీపీ, జనసేన పార్టీల మద్దతుతో పోటీచేసిన అభ్యర్థులు పలుచోట్ల విజయాలను సొంతం చేసుకున్నారు.

వైసీపీకి షాక్‌
అంబాజీపేట మండలం జి.అగ్రహారంలో ఆదివారం రాత్రి ఓట్ల లెక్కింపు దృశ్యం

  • కోనసీమ ఫలితాలతో అధికార పార్టీ కకావికలం
  • గట్టి షాక్‌ ఇచ్చిన టీడీపీ, జనసేన, స్వతంత్రులు
  • కోట్లు కుమ్మరించినా వైసీపీకి చేదు ఫలితాలే
  • టీడీపీ-జనసేన అసాధారణ పొత్తుతో కీలక స్థానాలు సైతం కైవసం
  • ప్రముఖుల స్వగ్రామాల్లో వైసీపీ ఘోర పరాజయం
  • మేజర్‌ పంచాయతీల్లోను టీడీపీ, జనసేన పాగా

తుది విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన అమలాపురం డివిజన్‌ పరిధిలో ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీకి గట్టి షాక్‌నిచ్చాయి. అధిష్ఠాన నిర్ణయాలతో సంబంధం లేకుండా టీడీపీ, జనసేన పార్టీల మద్దతుతో పోటీచేసిన అభ్యర్థులు పలుచోట్ల విజయాలను సొంతం చేసుకున్నారు. అధికార వైసీపీ కీలక నేతల స్వగ్రామాల్లో సైతం వైసీపీ అభ్యర్థులు పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన కోనసీమ పంచాయతీల తుదిపోరు ఫలి తాలు ఎన్నికల్లో మార్పునకు నాంది పలికిందనే చెప్పాలి. సగం పంచాయతీలు టీడీపీ, జనసేన, స్వతంత్ర అభ్యర్థులు తమ ఖాతాల్లో వేసుకున్నారు. సాధారణ ఎన్నికలను తల పించే రీతిలో సర్పంచ్‌ స్థానాలకు పోటీచేసిన అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చుచేశారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు అధికార వైసీపీకి చెందిన నాయ కుల కనుసన్నల్లో ఓట్లు కొనుగోలు జరిగినప్పటికీ చేదు ఫలి తాలను చవిచూడాల్సి వచ్చింది. ఒక్కొక్క పంచాయతీ పరిధి లో రెండేసి కోట్ల రూపాయలను ఖర్చుచేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు అమ లాపురం డివిజన్‌ పరిధిలోని 16 మండలాల్లో 273 పంచా యతీలకు ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవాలతో కలిపి ఇప్పటి వరకు 225 స్థానాలను ప్రకటించారు. వాటిలో వైసీపీ మద్దతుదారులు 123 స్థానాల్లోను, టీడీపీ మద్దతుదారులు 42 స్థానాల్లోను, జనసేన 17 స్థానాల్లోను, టీడీపీ-జనసేన మరో 17 స్థానాల్లోను, స్వతంత్ర అభ్యర్థులు 24మంది విజ యాలను సొంతం చేసుకున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి పినిపే విశ్వరూప్‌ స్వగ్రామమైన నడవపల్లిలో వైసీపీ ఓటమి చెంది స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్వగ్రామమైన నగరంలో టీడీపీ అభ్యర్ధి గెలుపొందారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ స్వగ్రామమైన అయినాపురంలో వైసీపీ రెబల్‌ అభ్యర్ధి మోకా రామారావు విజ యం సాధించారు. అయితే మేజర్‌ పంచాయతీల్లో సైతం తెలుగుదేశం, జనసేన మద్దతుదారులే విజయాన్ని సొంతం చేసుకున్నారు. అమలాపురం రూరల్‌ మండ లం బండారులంక ఎన్నికను మంత్రి విశ్వరూప్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసి నప్పటికీ వైసీపీ అభ్యర్ధికి పరాజయం తప్పలేదు. టీడీపీ మద్దతుతో పెనుమాల సునీత విజయాన్ని కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా అమలాపురం, గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో ఫలితాలపై నేతలు అప్పుడే విశ్లేషణ చేసుకుంటున్నారు.  అదేవిధంగా ఈదరపల్లిలో జనసేన అభ్యర్ధి రాయుడు తారక ఫణీంద్ర విజయం సాధించారు. పి.గన్నవరంలో టీడీపీ-జనసేన మద్దతుతో బొండాడ నాగమణి విజ యం సాధించారు. అయినవిల్లి సర్పంచ్‌గా టీడీపీ మద్దతు అభ్యర్ధి విజయం సాధిం చారు. మేజర్‌ పంచాయతీల్లోనూ వైసీపీ నష్టపోయింది. అంబాజీపేట మం డలం మాచవరంలో బ్యాలెట్‌ పత్రాల లెక్కల్లో తేడా రావడంతో రీకౌంటింగ్‌ చేశారు.

టీడీపీ-జనసేన ఉమ్మడి దెబ్బ ఇది..

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ- జనసేన అధిష్ఠాన నిర్ణయాలతో సంబంధం లేకుండా పోటీచేసి విజయాలను సొంతం చేసుకు న్నాయి. కీలక స్థానాల్లో సైతం జయకేతనం ఎగురవేశారు. మేజ ర్‌  పంచాయతీలను కూడా ఆ పార్టీల అభ్యర్థులు సొంతం చేసు కున్నారు. జనసేనకు చెందిన రాజోలు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో అనేక స్థానాలను జనసేన పార్టీ అభ్య ర్థులు గెలుపొందారు. ఈ పరి ణామాలు అటు రాపాకకు, ఇటు అధికార వైసీపీ నేతలకు మింగు డు పడడం లేదు. మొత్తం మీద 85కు పైగా టీడీపీ, జనసేన అభ్య ర్థులు విజయభేరి మోగించారు. కోనసీమ ఫలితాలు మార్పుకు నాందిగా చెబుతున్నారు.

Updated Date - 2021-02-22T07:44:16+05:30 IST