వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST

వైసీపీ అరాచక, నియంత పాలనకు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే శంకర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడాలి
కురబలకోట సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే శంకర్‌

కురబలకోట, మే20 వైసీపీ అరాచక, నియంత పాలనకు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే శంకర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. కురబల కోట మండలం అంగళ్ళులో బాదుడే బాదుడు, తెలుగు యువత అధ్య క్షుడు శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత మహాసభ కార్యక్రమా లను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్ర తలు కరువయ్యయన్నారు. స్థానిక నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని, భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యపాలన కొనసాగిస్తున్నారన్నారు.  అభివృద్ధిని విస్మరించి టీడీపీ నేతలపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. పిచ్చలవాండ్లపల్లె పంచాయతీలో నిర్మించనున్న ప్రాజెక్టుకు భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగలేదని, కనీసం ఇప్పటి దాకా పరిహారం ఎంత ఇస్తారో కూడా నిర్ణయించలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే పరిహారం చెల్లించి పనులు ప్రారంభించాలన్నారు. అనంతరం ఎర్రబల్లికి చెందిన 50మంది వైసీపీ కార్యకర్తలు శంకర్‌ సమక్ష్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నేతలు సుదర్శన్‌ రెడ్డి, వైజి సురేంద్ర, రమణ, ఆనందరెడ్డి, మౌలా, చంద్ర, భూమిరెడ్డి, వైజి రమణ, వెంకట రమణారెడ్డి, శ్రీనాథరెడ్డి, ఎల్లారెడ్డి, భూమిరెడ్డి, శ్రీని వాసులు తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీకి అనుమతుల్లేవంటూ పోలీసులు అభ్యంతరం

టీడీపీ చేపట్టిన ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు అభ్యంతరం తెలిపారు. కురబలకోట మండలం అంగళ్ళు భారత్‌ కళ్యాణమండపం నుంచి బస్డాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు అభ్యంతరం తెలపడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ర్యాలీని కొనసాగించారు.

అంగళ్ళుకు బయలుదేరి వెళ్లిన టీడీపీ శ్రేణులు

ములకలచెరువు, మే 20: కురబలకోట మండలం అంగళ్ళులో జరిగిన తంబళ్లపల్లె నియోజకర్గ తెలుగు యువత బహిరంగ సభకు మండలం లోని బురకాయలకోట నుంచి టీడీపీ నాయకులు, యువనాయకులు బయలుదేరి వెళ్ళారు. మండల తెలుగు యువత అధ్యక్షుడు జేసీబీ సుధాకర్‌నాయుడు, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ బీసీ సెల్‌ అధికార ప్రతినిధి ముత్తుకూరు మౌలా అధ్వర్యంలో 50కు పైగా ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు.  కార్యక్రమంలో నేతలు విజయ్‌కుమా ర్‌, రామకృష్ణమరాజు, చెన్నకేశవ, పరికిరెడ్డెప్ప, బాలాజీ, శివన్న పాల్గొన్నారు. 




Updated Date - 2022-05-20T05:30:00+05:30 IST