కౌంటింగ్‌ ఏజంట్లకు.. వైసీపీ వల

ABN , First Publish Date - 2021-03-12T05:55:19+05:30 IST

దాడులు, దౌర్జన్యాలతో మునిసిపల్‌ ఎన్ని కల పోలింగ్‌ ప్రక్రియ ముగియగా ఇక కౌంటింగ్‌పై అధికార పార్టీ గురిపెట్టినట్లు ప్రతి పక్షాలు భావిస్తున్నాయి.

కౌంటింగ్‌ ఏజంట్లకు.. వైసీపీ వల

టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్న డివిజన్లపై గురి

రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆఫర్‌

ఓట్ల లెక్కింపులో ఫలితాలు తారుమారు చేసేందుకు వ్యూహం


గుంటూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): దాడులు, దౌర్జన్యాలతో మునిసిపల్‌ ఎన్ని కల పోలింగ్‌ ప్రక్రియ ముగియగా ఇక కౌంటింగ్‌పై అధికార పార్టీ గురిపెట్టినట్లు ప్రతి పక్షాలు భావిస్తున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల ఫలి తాలను తారు మారు చేసిన విధ ంగా మునిసిపల్‌ ఎన్నికల్లోనూ అదే వైఖరిని అవలంబించే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నాయి. ఈ నేప థ్యంలో ఇప్పటికే కొంత మంది తమ పార్టీ కౌంటింగ్‌ ఏజంట్లకు ప్రలోభాలతో వల విసిరినట్లుగా అనుమానిస్తున్నాయి. ఇందుకోసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కూడా నగదు ఇచ్చేందుకు ఆపర్లు వచ్చినట్లుగా సమాచారాన్ని సేకరించాయి. దీంతో చివరి నిమిషంలో పోలింగ్‌ ఏజంట్లలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నాయి. 

మునిసిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 14వ తేదీన ఆదివారం జరగనుంది. ప్రతీ పోలింగ్‌ బూత్‌కు ఒక టేబుల్‌ వేసి ఓట్ల లెక్కింపు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు మునిసిపల్‌ కమిషనర్లు సంబంధిత ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సువిశాలమైన గదులు ఏర్పాటు చేసి అందులో ఓట్ల లెక్కింపు టేబుల్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక డివిజన్‌/వార్డులో ఎనిమిది పోలింగ్‌ బూత్‌లు ఉంటే ఎనిమిది టేబుల్స్‌ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపడతారు. దీనివలన కౌంటింగ్‌ కూడా త్వరగా పూర్తి అవుతుంది. ఇందుకోసం ఒక్కో టేబుల్‌ వద్దకు అభ్యర్థులకు సం బంధించి ఒక్కో పోలింగ్‌ ఏజంట్‌ని అనుమతిస్తారు. సంబంధిత వార్డు/డివిజన్‌లో ఓటుహక్కు కలిగిన వారినే కౌంటింగ్‌ ఏ జంట్లుగా నియమిస్తారు. ఇం దుకోసం పేర్లతో శుక్రవారం రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలకు రావాలని సమాచారం ఇచ్చారు. 

ఇదిలావుంటే తమ ప్రత్యర్థి పార్టీలు ఎవరెవరిని కౌంటింగ్‌ ఏజంట్లుగా పెట్టబోతున్నాయనే వివరాలను అధికార పార్టీ వర్గాలు సేకరిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన -బీజేపీ కూటమి, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు బలంగా ఉన్న డివిజన్లు/వార్డులపై దృష్టి సారించాయి. ఓట్ల లెక్కింపులో ఏమాత్రం స్వల్ప మెజార్టీ కనక ప్రత్యర్థి పార్టీలకు వస్తే వెంటనే రీకౌంటింగ్‌ కోరి ఫలితాన్ని తారుమారు చేయాలన్న వ్యూహరచన జరుగుతున్నట్లు ప్రతిపక్షాలు సందేహిస్తున్నాయి. ఇటీవలన జరిగిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా అనేకచోట్ల ఇలాంటి సంఘటనలే చోటు చేసుకొన్నాయి. దీంతో కౌంటింగ్‌ ఏజంట్లను బాగా నమ్మకస్తులనే నియమించేందుకు అభ్యర్థులు వడపోస్తున్నారు. 

Updated Date - 2021-03-12T05:55:19+05:30 IST