
అమరావతి: పోలవరంలో శుక్రవారం వైసీపీ, బీజేపీ బలప్రదర్శనలు చేయనుంది. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పర్యటన సందర్బంగా బీజేపీ బలప్రదర్శనకు సిద్దమైంది. పోలవరం మోదీ వరం పేరుతో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గజేంద్రసింగ్ షెకావత్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీ స్వాగతం పలకాలని బీజేపీ నిర్ణయించింది. కాగా షెకావత్‌ను రాత్రి డిన్నర్‌కు సీఎం జగన్ ఆహ్వానించారు. అయితే షెకావత్ వెంట సీఎం ఇంటికి ఎవరూ వెళ్లకూడదని బీజేపీ నేతలు నిర్ణయించారు. శుక్రవారం షెకావత్ పర్యటన మొత్తం ముఖ్యమంత్రితో కావడంతో పోలవరంలో తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని బీజేపీ నేతలు షెకావత్‌ను అడిగారు. దీంతో వారికి గంట సమయం ఇచ్చారు. పోలవరం కేంద్రం పుణ్యమేనని చెప్పాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పోలవరంలో అడుగడుగున బీజేపీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, మోదీ ఫోటోలు కనిపించాలని బీజేపీ భావిస్తుండగా.. పోలవరం తమ ఘనతేనని చెప్పుకోవాలని వైసీపీ నేతలు తాపత్రాయం పడుతున్నారు.
ఇవి కూడా చదవండి