ప్రజల నడ్డివిరుస్తున్న వైసీపీ

ABN , First Publish Date - 2022-05-19T04:58:28+05:30 IST

వైసీపీ ప్రభుత్వం పన్నుల బాదుడు, ధరల మోతతో ప్రజల నడ్డి విరుస్తున్నదని టీడీసీ నేతలు మండిపడ్డారు. మండలంలోని తూర్పు తక్కెళ్ళపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. ఉప్పు, పప్పులతో పాటు పెట్రోల్‌ డీజిల్‌ ధరలు, విద్యుత్‌ చార్జీలు, బస్‌ ఛార్జీల పెంపు పేద, మద్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుకూడా లేదని ధ్వజమెత్తారు. వీధుల వెంట ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు.

ప్రజల నడ్డివిరుస్తున్న వైసీపీ
పంగులూరు మండలంలోని తూర్పుతక్కెళ్లపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు.

బాదుడే బాదుడులో  టీడీపీ విమర్శ

పంగులూరు, మే 18 : వైసీపీ ప్రభుత్వం పన్నుల బాదుడు, ధరల మోతతో ప్రజల నడ్డి విరుస్తున్నదని టీడీసీ నేతలు మండిపడ్డారు. మండలంలోని తూర్పు తక్కెళ్ళపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. ఉప్పు, పప్పులతో పాటు పెట్రోల్‌ డీజిల్‌ ధరలు, విద్యుత్‌ చార్జీలు, బస్‌ ఛార్జీల పెంపు పేద, మద్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుకూడా లేదని ధ్వజమెత్తారు. వీధుల వెంట ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు రావూరి రమేష్‌, మాజీ జడ్పీటీసీ  కె.వి. సుబ్బారావు, పార్టీనేతలు మద్దిరెడ్డి పిచ్చిరెడ్డి, పచ్చా శ్రీనివాసరావు, కుక్కపల్లి ఏడుకొండలు, మస్తాన్‌వలి, బెల్లంకొండ దశరథ, మాజీ సర్పంచ్‌లు అమృతపూడి ఏసోబు, ఉన్నం రవిబాబు, వరపర్ల సుబ్బారావు, గుడిపాటి సుబ్బారెడ్డి, దాసరి హనుమంతరావు, చల్లగుండ్ల కోటేశ్వరరావు, కందిమళ్ల రామాంజనేయులు, పలుగ్రామాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 బల్లికురవలో..

బల్లికురవ :  వైసీపీ ప్రభుత్వం ధరలు పెంచి పేదలపై  బాదుడే బాదుడులా వ్యవహరిస్తుందని మండల టీడీపీ నేతలు విమర్శించారు. బుధవారం మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు గ్రామాలలో తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వంపై నిరసనగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా నేతలు ఇంటింటికీ తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు,  నేడు వైసీపీ ప్రభుత్వం పెంచిన ధరలపై కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలపై పెనభారం మోపుతుందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నేతలు ఇజ్రాయల్‌, అమరనేని కాశీయ్య, హనుమంతరావు, ముండ్రు దానయ్య తదితరులు పాల్గొన్నారు.

సంతమాగులూరులో..

సంతమాగులూరు :   ప్రజలపై ప్రభుత్వం వేస్తున్న పన్నులను ఇంటింటికి తిరిగి వివరిస్తూ బాదుడే  బాదుడు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామంలో బుదవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూపాటి ఏసోబు, తేలప్రోలు రమేష్‌, గాడిపర్తి వెంకట్రావు, కోణికి గోవిందమ్మ, గమిడి కోటేశ్వరరావు, పసుపులేటి కోటేశ్వరరావు, గాడిపర్తి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.



రేపు అద్దంకిలో బాదుడే బాదుడు 

అద్దంకి : వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ టీడీపీ అద్దంకి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 వతేదీన చేపట్టే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని విజయంతం చేయాలని పట్టణ పార్టీ అధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు కోరారు. బుధవారం రా త్రి స్థానిక పోతురాజుగండి వద్ద టీడీపీ కార్యాలయంలో టీడీపీ పట్టణ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాదుడే బాదుడు కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు,  మహానాడుకు తరలివెళ్లే అంశాలపై చర్చించారు. ఒంగోలు వద్ద ఈ నెల 27,28 తేదీలలో జరిగే మహానాడుకు అద్దంకి పట్టణం నుంచి భారీగా తరలివెళ్ళే విఽధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు వడ్డవల్లి పూర్ణచం ద్రరావు, కుందారపు రామారావు, కాకాని అశోక్‌, స్టాలిన్‌, మన్నం త్రిమూర్తులు, నాగరాజు, చుండూరి మురళీ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-19T04:58:28+05:30 IST