మా సొమ్ము మాకివ్వడానికి సంవత్సరాలా?

ABN , First Publish Date - 2022-08-11T05:24:37+05:30 IST

‘మా వేతనాల నుంచి జమ చేసుకున్న సొమ్ము మాకివ్వడానికి బిల్లులు పెడితే సంవత్సరాలు తరబడి పెండింగ్‌ పెట్టడం ఏంట’ని ఎస్‌టీయూ నేతలు ధ్వజమెత్తారు.

మా సొమ్ము మాకివ్వడానికి సంవత్సరాలా?
ధర్నాలో మాట్లాడుతున్న ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి

 ఎస్‌టీయూ ఆగ్రహం.. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

అనంతపురం టౌన, ఆగస్టు 10: ‘మా వేతనాల నుంచి జమ చేసుకున్న సొమ్ము మాకివ్వడానికి బిల్లులు పెడితే సంవత్సరాలు తరబడి పెండింగ్‌ పెట్టడం ఏంట’ని ఎస్‌టీయూ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహిం చారు. ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సూరీడు, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి తదితరులు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్ల కు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం పెండింగ్‌ పెట్టిందన్నారు. జడ్‌పీపీఎఫ్‌, సంపాదిత సెలవుల బిల్లులు, కరువు భత్యం బకాయిలు, మెడికల్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నా యన్నారు. నెలలు, సంవత్సరాలు తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు రావడం లేదన్నారు. ట్రెజరీ అధికారులు మాత్రం మా దగ్గర పెండింగ్‌ లేవు, సీఎఫ్‌ ఎంఎ్‌సకు పంపించాం అని చెప్పి తప్పుకుంటున్నారన్నారు. విద్యావ్యవస్థను వివిధ సంస్కరణల పేరుతో ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు.  సీఎం జగన ఇచ్చిన హామీ మేరకు సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉపాధ్యాయులను వివిధ యాప్‌ల పేరుతో మానసికంగా వేధించడం మానుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చ రించారు. అనంతరం జేసీ కేతనగార్గ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌టీయూ నాయకు లు కృష్ణమూర్తి, రామాంజనేయులు, ఫణిభూషన, నాగ రాజు, రాజశేఖర్‌,  నాయకులు పాల్గొన్నారు. వీరి ఆందోళనకు బీసీ కులాల ఐక్యవేదిక నాయకుడు నాగరాజు సంఘీభావం తెలిపారు.

Updated Date - 2022-08-11T05:24:37+05:30 IST