అట్టహాసంగా బండలాగుడు పోటీలు

ABN , First Publish Date - 2022-06-28T03:22:57+05:30 IST

మండలంలోని కాకొల్లువారిపల్లిలో నిర్వహిస్తున్న అంకాళ పరమేశ్వరి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం ఎద్దల బండలాగుడు పోటీలు నిర్వహించారు.

అట్టహాసంగా బండలాగుడు పోటీలు
బండలాగుతున్న ఎద్దులు

వరికుంటపాడు, జూన్‌ 27: మండలంలోని కాకొల్లువారిపల్లిలో నిర్వహిస్తున్న అంకాళ పరమేశ్వరి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం ఎద్దల బండలాగుడు పోటీలు నిర్వహించారు. 20 నిమిషాల వ్యవధిలో ఎద్దులు బండలాగిన దూరాన్ని బట్టి విజేతలను ప్రకటించారు. ఈ పోటీల్లో వైఎ్‌సఆర్‌ కడప జిల్లా పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎం.బైపురెడ్డి, గోపవరంకు చెందిన గోపవరం నెమెలయ్య, గుంతపల్లికి చెందిన శ్రీనివాసనాయుడు, నెల్లూరు జిల్లా కొమ్మి గ్రామానికి చెందిన చెరుకూరిదేవపూజిత చౌదరికి చెందిన ఎద్దులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ స్థానాల్లో నిలిచాయి. అనంతరం విజేతలకు రూ.25వేలు, రూ.20వేలు, రూ.15వేలు, రూ.7500ల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Updated Date - 2022-06-28T03:22:57+05:30 IST