‘అప్ప’ పర్యటనకు లైన్‌ క్లియర్‌

ABN , First Publish Date - 2021-11-06T17:05:31+05:30 IST

రాష్ట్ర పర్యటనకు యడియూరప్ప సిద్ధమయ్యారు. మూడు నెలల నుంచి వివిధ కారణాలతో వాయిదాలు పడుతూ వస్తున్న యడియూరప్ప రాష్ట్ర పర్యటనకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. అయితే ఒక్కరే కాకుండా మరో ముగ్గురు అగ్రనేత

‘అప్ప’ పర్యటనకు లైన్‌ క్లియర్‌

బెంగళూరు: రాష్ట్ర పర్యటనకు యడియూరప్ప సిద్ధమయ్యారు. మూడు నెలల నుంచి వివిధ కారణాలతో వాయిదాలు పడుతూ వస్తున్న యడియూరప్ప రాష్ట్ర పర్యటనకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. అయితే ఒక్కరే కాకుండా మరో ముగ్గురు అగ్రనేతలు ఆయన వెంట ఉండేలా నిర్ణయించారు. యడియూరప్పతో పాటు మాజీ సీఎంలు జగదీ‌ష్‌శెట్టర్‌, సదానందగౌడ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ ఉంటారు. మరో రెండేళ్లలో జరిగే శాసనసభ ఎన్నికల వ్యూ హంలో భాగంగానే పర్యటనలు ఉంటాయని పార్టీ ముఖ్యనేత ద్వారా తెలిసింది. మిషన్‌ 140 లక్ష్యంగా పెట్టుకునే జిల్లాల వారిగా పర్యటనలు ఉంటాయి. శనివారం జరిగే పార్టీ కోర్‌కమిటీ సమావేశంలో టూర్‌కు సంబంధించి కీలక తీర్మానాలు జరగనున్నాయి. యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే రాష్ట్ర పర్యటనకు వెళతానని ప్రకటించారు. కానీ ఒక్కరే పర్యటన సాగిస్తే ప్రస్తుత సీఎం బసవరాజ్‌ బొమ్మై పాలనకు సమస్యగా మారుతుందనే అధిష్ఠానం అనుమతులు ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా  రెండు శాసనసభా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ముగియడంతో ఇదే ఉత్సాహం కొనసాగించదలచి రాష్ట్ర పర్యటనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇతరులు ఎంతమంది ఉన్నా యడియూరప్ప ప్రభావంగానే పర్యటనలు విజయవంతం చేయాలని రాష్ట్ర పార్టీతో పాటు పలువురు సీనియర్‌లు అభిప్రాయమైనట్లు సమాచారం. 

Updated Date - 2021-11-06T17:05:31+05:30 IST