‘త్రిశంకు’లో ‘ఏడు రంగుల..`లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్‌

Jun 16 2021 @ 20:52PM

స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ సోద‌రుడు అమన్ ప్రీత్ సింగ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘త్రిశంకు’. ప్రాచి తెహ్లాన్ , రష్మీ గౌతమ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సుమ‌న్‌, మహేష్ ఆచంట, నవీన రెడ్డి కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. శ్రీ కృష్ణ గొర్లె దర్శకత్వంలో గణేశ్ క్రియేష‌న్స్‌, ఎ.యు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై లండన్ గణేష్ మరియు నల్ల అయ్యన్న నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫ‌స్ట్ లిరికల్ సాంగ్ ‘ఏడు రంగుల ఓ ఇంద్ర‌ధ‌నస్సులా’ ను టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కి విషెస్ తెలిపారు.   రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాటకి సునీల్ క‌శ్య‌ప్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. భాష్యశ్రీ సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా..

దర్శకుడు శ్రీ కృష్ణ గొర్లె మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ప్రతి పాత్ర ఎంతో చక్కగా రూపుదిద్దుకుంది. అడగ్గానే ఈ చిత్రంలోని పాటను విడుదల చేయటానికి ఒప్పుకున్న హీరో దగ్గుబాటి రానా గారికి ధన్యవాదాలు’’ అన్నారు. నిర్మాతలు లండన్ గణేష్, నల్ల అయ్యన్న మాట్లాడుతూ ‘‘దర్శకుడు  శ్రీ కృష్ణ చెప్పిన పాయింట్ ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమాలో మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. చిత్రం ఎంతో బాగా వచ్చింది. మా చిత్రంలోని తొలి పాటను విడుదల చేసిన  రానా గారికి కృతజ్ఞతలు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.