మంచిర్యాల: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 15 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 175267 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 175266 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలుకాగా... ప్రస్తుత నీటి నిల్వ 19.5363 టీఎంసీలుగా నమోదు అయ్యింది.