Viral Video: ఆకాశంలో విహరిస్తున్న పక్షుల గుంపు ఒక్కసారిగా నేల మీద పడి.. చివరకు..

ABN , First Publish Date - 2022-02-16T18:20:00+05:30 IST

ఆకాశంలో వేల సంఖ్యలో పక్షులు కలిసి విహరిస్తుండడాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.

Viral Video: ఆకాశంలో విహరిస్తున్న పక్షుల గుంపు ఒక్కసారిగా నేల మీద పడి.. చివరకు..

ఆకాశంలో వేల సంఖ్యలో పక్షులు కలిసి విహరిస్తుండడాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఆకాశంలో విహరిస్తున్న పక్షులు ఒక్కసారిగా నేల మీద పడిపోయాయి. వాటిల్లో చాలా వరకు తిరిగి ఎగిరిపోగా.. వందల సంఖ్యలో పక్షులు చనిపోయాయి. ఈ వీడియో చూసిన పర్యావరణ ప్రేమికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  


మెక్సికోలో  పసుపు రంగు తలతో ఉన్న వేల పక్షులు ఆకాశంలో విహరిస్తున్నాయి. ఆకాశంలో విహరిస్తూ ఉన్నట్టుండి ఒకేసారి భూమి మీద పడిపోయాయి. చాలా పక్షులు తిరిగి ఎగిరిపోయాయి. వందల సంఖ్యలో పక్షులు చనిపోయాయి. ఇన్ని పక్షులు ఒకేసారి చనిపోవడానికి 5జీ టెక్నాలజీ కారణమని కొందరు, విద్యుత్ తీగలకు తగిలి చనిపోయాయని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. అయితే పర్యావరణ నిపుణులు మాత్రం.. ఈ మందను ఓ పక్షి వేటాడి ఉండొచ్చని, దాని నుంచి తప్పించుకునే క్రమంలో అవి కింద పడిపోయాయని, ఆ క్రమంలో కొన్ని చనిపోయి ఉంటాయని అంటున్నారు. 


పెరెగ్రైన్ లేదా హాక్ వంటి పక్షులు ఈ మందను వెంబడించి ఉండొచ్చని అంటున్నారు. కాగా, ఆ ఘటన ఓ ఇంటికి అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేల మంది ఆ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. 



Updated Date - 2022-02-16T18:20:00+05:30 IST