ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలి

ABN , First Publish Date - 2021-03-02T06:36:46+05:30 IST

ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలి

ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలి
మాట్లాడుతున్న ఎన్నికల ప్రత్యేక అధికారి సరళావందనం


 ప్రత్యేక అధికారి సరళా వందనం

మార్కాపురం (వన్‌టౌన్‌) మార్చి 1 : త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఎ న్నికల సంఘం సూచించిన నియమ నిబంధనలు అన్ని పార్టీలు కచ్చితంగా పాటించాలని డిప్యూటీ కలెక్టర్‌ లాండ్స్‌, ఎన్నికల ప్ర త్యేకాధికారి సరళా వందనం అన్నారు. స్థాని క మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం రాత్రి అన్ని  రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా సహకరించాలన్నారు. ఏవైనా అవకతవకలకు పాల్పడితే ఏ పార్టీ నాయకులైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు వారి పరిధిలో ఉండే సూచనల మేరకు వ్యవహరించాలన్నారు. ఆర్డీవో ఎం.శేషిరెడ్డి మాట్లాడుతూ ఆ నెల 2, 3 తేదీలలో నామినేషన్లు దాఖ లు చేసిన వారు ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉంటుంద ని అన్నారు. మున్సిపాలిటీ ఎ న్నికలలో రీ-పోలింగ్‌కు అవకా శం లేకుండా ప్రశాంతంగా జరి గేలా అన్ని పార్టీలు సహకరించాలన్నారు. కౌంటింగ్‌ కేం ద్రంలో 11 టేబుళ్లు ఏర్పాటు చేసి అధికారులకు  కేటాయిస్తున్నామన్నారు. సమావేశంలో కమిషనర్‌ సీఏఎం నయీం అహ్మద్‌, డీఈ షేక్‌ సుభానీ, పట్టణ ఎస్‌ఐ కిశోర్‌ బాబు, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, విశ్రాంత డీఈ ఈశ్వరయ్య, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, వైసీపీ పట్టణ కన్వీనర్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి అందె నాసరయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-03-02T06:36:46+05:30 IST