‘ఎస్’ బ్యాంకు జోష్

ABN , First Publish Date - 2021-07-26T23:00:34+05:30 IST

ప్రైవేటు లెండర్ యస్ బ్యాంకు షేర్లు జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో సోమవారం మంచి జోష్‌ను కనబరచాయి.

‘ఎస్’ బ్యాంకు జోష్

ముంబై : ప్రైవేటు లెండర్ యస్ బ్యాంకు  షేర్లు జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో సోమవారం మంచి జోష్‌ను కనబరచాయి. బీఎస్ఈపై ఎర్లీ డీల్స్‌లో 4 శాతానికి పైగా పెరిగి షేర్‌కు రూ. 13.6 చొప్పున ట్రేడవుతున్నాయి. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో తక్కువ కేటాయింపులు, ఇతర ఆదాయాల నేపధ్యంలో నికర లాభం రూ. 45 కోట్లు నమోదు కాగా, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం నాలుగు రెట్లు పెరిగి రూ. 207 కోట్లకు చేరుకుంది.


డిసెంబరు 2018 తర్వాత ఇదే అత్యధిక నెట్ ప్రాఫిట్ అని బ్యాంకు వెల్లడించింది. వాస్తవానికి... ఎస్ బ్యాంకు కేటాయింపులు 41 శాతం పడిపోయి రూ. 644 కోట్లకు చేరుకోగా, ఇతరత్రా ఆదాయం 70 శాతం పెరిగి రూ. 1,056 కోట్లకు చేరుకుంది. యస్ బ్యాంకు నికర వడ్డీ ఆదాయం, ఆర్జించిన, వ్యయం చేసిన వడ్డీ మధ్య వ్యత్యాసం 26.5 శాతం తగ్గి రూ. 1,402 కోట్ల వద్ద నిలిచింది. 

Updated Date - 2021-07-26T23:00:34+05:30 IST