పర్యాటకుల స్వర్గధామం యస్ ఐలాండ్
ABN , First Publish Date - 2021-05-16T05:30:00+05:30 IST
మిరుమిట్లు గొలిపే బాణసంచా... ఎటుచూసినా తారాజువ్వల కాంతులతో ఆ దీవి మొత్తం వెలిగిపోయింది. రంజాన్ సందర్భంగా అబుదాబిలోని యస్ దీవిలో బాణసంచాను కాల్చి పండుగను ఘనంగా జరుపుకొన్నారు...
మిరుమిట్లు గొలిపే బాణసంచా... ఎటుచూసినా తారాజువ్వల కాంతులతో ఆ దీవి మొత్తం వెలిగిపోయింది. రంజాన్ సందర్భంగా అబుదాబిలోని యస్ దీవిలో బాణసంచాను కాల్చి పండుగను ఘనంగా జరుపుకొన్నారు.
- యస్ ఐలాండ్ పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తోంది. ఈమధ్యకాలంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న వినోద కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడికి అబుదాబి నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. దుబాయి నుంచి 50 నిమిషాల్లో చేరుకోవచ్చు.
- ఇక్కడ ఈదుల్ ఫితర్ వేడుకలను రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల మధ్య పర్యాటకులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
- ఈ ఐలాండ్‌లో ధీమ్ పార్క్స్, షాపింగ్ మాల్స్, గోల్స్కోర్స్, వాటర్ స్పోర్ట్స్ వంటివి ఉన్నాయి. మ్యూజికల్, ఫ్యామిలీ ఈవెంట్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హోటల్స్, ఇండోర్, అవుట్డోర్లు వేడుకలకు అవసరమైన సదుపాయాలు ఉన్నాయి.
- 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఐలాండ్‌లో అవార్డులు గెలుచుకున్న థీమ్ పార్కులు ఉన్నాయి అందులో ఫెరారీ వరల్డ్ ఒకటి. వరల్డ్ ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్ ఇక్కడే ఉంది. గంటకు 240 కి.మీ వేగంతో 52 మీటర్ల ఎత్తు వరకు వెళుతుంది.
- ఈ ఐలాండ్‌ను సందర్శించే పర్యాటకుల కోసం పూర్తిస్థాయిలో కొవిడ్ జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఇక్కడ దాదాదాపు 93 శాతం వాక్సినేషన్ పూర్తయింది. అంతేకాదు ప్రపంచంలోనే పూర్తి వాక్సినేషన్ జరుపుకొన్న మొదటి హాలిడే డెస్టినేషన్‌గా గుర్తింపు పొందింది.