మేము గాంధీల బానిసలం.. సీఎం సలహాదారు సంచలన కామెంట్స్

Published: Wed, 23 Mar 2022 17:33:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మేము గాంధీల బానిసలం.. సీఎం సలహాదారు సంచలన కామెంట్స్

జైపూర్: ''అవును. నాతో సహా  కాంగ్రెస్ నాయకులంతా గాంధీ-నెహ్రూ కుటుంబానికి బానిసలం'' అని రాజస్థాన్ ముఖ్యమంత్రి సలహాదారుల్లో ఒకరైన సిరోధి ఎమ్మెల్యే సన్యం లోధా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీలో బుధవారంనాడు ఓ అంశంపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హరిదేవ్ జోషి యూనివర్శిటీ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ (సవరణ) బిల్లు-2022పై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా మధ్యలో లోథా జోక్యం చేసుకుంటూ ''అవును, మేము బానిసలమే. మా తుదిశ్వాస వరకూ గాంధీ-నెహ్రూ కుటుంబానికి బానిసత్వం చేస్తాం. ఎందుకంటే..ఈ దేశ నిర్మాణం జరిపింది గాంధీ-నెహ్రూ కుటుంబమే'' అని ఆయన వ్యాఖ్యానించారు.



కాంగ్రెస్ నేతలంతా బానిసలంటూ లోథా వ్యాఖ్యానించగానే విపక్ష ఉప నేత రాజేంద్ర రాథోడ్ స్పందించారు.  ''ఓ..మీరు బానిసలా? ఇదో కొత్త సంస్కృతిలా ఉంది. మీ బానిసత్వానికి అభినందనలు'' అంటూ వ్యాఖ్యానించారు. బానిసలు తమ మనసులో ఏముందో మాట్లాడలేరంటూ చురకలు వేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఇంత బానిసత్వం చేసినా మీకు (లోధా) కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే కాళీచరణ్ సరాఫ్ సభలో గుర్తు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా లోధా పోటీ చేశాడు. అనంతరం కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. ఇటీవలే ఆయన ముఖ్యమంత్రి సలహాదారుగా నియమితులయ్యారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.