Festivals: 30న యశ్వంతపురం నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2022-08-25T17:47:54+05:30 IST

పండుగల రద్దీని తట్టుకునే దిశలో ఈ నెల 30 బెంగళూరులోని యశ్వంతపురం(Yeshwanthapuram) నుంచి సికింద్రాబాద్‌(Secunderabad)కు

Festivals: 30న యశ్వంతపురం నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు

బెంగళూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): పండుగల రద్దీని తట్టుకునే దిశలో ఈ నెల 30 బెంగళూరులోని యశ్వంతపురం(Yeshwanthapuram) నుంచి సికింద్రాబాద్‌(Secunderabad)కు ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ మేరకు బెంగళూరు రైల్వే డివిజన్‌ నగరంలో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. యశ్వంతపురంలో 07194 నెంబరు రైలు 30న సాయం త్రం 5.20కు బయల్దేరి వెళుతుంది. మరుసటి రోజు ఉదయం 6.45కు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకోనుంది. ఈ రైలు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం(Anantapur), డోన్‌, కర్నూల్‌, గద్వాల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, ఉమ్దానగర్‌, కాచిగూడల మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. 21 కోచ్‌లు ఉండే ఈ ప్రత్యేక రైలు చార్జీలు సాధారణ రోజుల టికెట్ల కంటే 30శాతం అధికమని ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2022-08-25T17:47:54+05:30 IST