ఇంకా పునాదులకే పరిమితం

ABN , First Publish Date - 2022-07-01T05:28:16+05:30 IST

మూడేళ్లు దాటిపోతున్నా స్టీల్‌ప్లాంట్‌ పునాదులకే పరిమితమైందని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత దేవగుడి నారాయణరెడ్డి విమర్శించారు.

ఇంకా పునాదులకే పరిమితం
ఎద్దుల ఈశ్వరరెడ్డి విగ్రహం ఎదుట సంతకం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, తదితరులు

మూడేళ్ల వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడిన ఉక్కు సాధన ఐక్యవేదిక

పోరాటాలతో ఉక్కు పరిశ్రమ సాధ్యం : మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి

జమ్మలమడుగు రూరల్‌, జూన్‌ 30: మూడేళ్లు దాటిపోతున్నా స్టీల్‌ప్లాంట్‌ పునాదులకే పరిమితమైందని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత దేవగుడి నారాయణరెడ్డి విమర్శించారు. గురువా రం స్థానిక ఎద్దుల ఈశ్వరరెడ్డి విగ్రహం ఎదుట ఉక్కు సాధ న ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంతకాల సేకరణలో ఆయన మా ట్లాడుతూ వైసీపీ, బీజేపీ దొందూ దొందే అన్నారు. హామీల ను నెరవేర్చడంలో విఫలమయ్యాయన్నారు. పోరాటాల ద్వా రానే ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులు సాధ్యమవుతాయన్నా రు. ప్రధానంగా కడపజిల్లాలో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు, ఉపాధికోసం ఎదురుచూస్తున్నారన్నారు.

ఇటీవల జమ్మలమడుగులో జరిగిన వైసీపీ ప్లీనరీలో కడప ఎంపీ అవినా్‌షరెడ్డి వచ్చి త్వరలో స్టీల్‌ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తారని, అందుకు భూములిచ్చిన రైతులకు 20 రోజుల్లో నష్టపరిహా రం చెల్లిస్తామని ప్రకటించడం హాస్యాస్పందంగా ఉందన్నా రు. పరిశ్రమ పనుల జాప్యంలో ఓబుళాపురం గనులు హైకోర్టులో ఉన్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల వాగ్ధానాలు చేసే సమయంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్‌ప్లాంట్‌కోసం శంకుస్థాపన చేసే సమయంలో ఓబుళాపురం గనులు హైకోర్టులో ఉందన్న విషయం తెలియ దా అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఏదో ఒకటి చెప్పి వెళ్లిపోవడం మోసపూరితమేనన్నారు. ప్రజలను నిరాశపరిచేలా మాట్లాడటం ప్రభుత్వ చేతకానితనమన్నారు.

సెయిల్‌ ఆధ్వర్యంలో చేయాల్సిన పనిని ముఖ్యమంత్రి నెత్తిమీద పెట్టుకుని ఉక్కు పరిశ్రమను ఆలస్యం చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి పోరాటాల ద్వారానే ఉక్కు పరిశ్రమను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీ ఎం జమ్మలమడుగు కార్యదర్శి శివనారాయణ మాట్లాడుతూ ఈప్రాంతంలో మూడుసార్లు ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపనలు చేసినా ఏదీ పూర్తి కాలేదన్నారు.  రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ మద్ధతు ఇవ్వడం దేనికి సంకేతమో తెలపాలన్నారు. టీడీపీ నేతలు రఫి, ఖదీర్‌, సయ్యద్‌బాష, సీఐటీయూ నేతలు దాసు, విజయ్‌, బుడగజంగం నేత నల్లప్ప, డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి శివకుమార్‌, సయ్యద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T05:28:16+05:30 IST