యోగాయనమః

ABN , First Publish Date - 2021-06-22T04:56:12+05:30 IST

ఆరోగ్యమే మహాభాగ్యమని యోగాసనాచార్య కందుల సత్యనారాయణ అన్నారు.

యోగాయనమః
ఆకివీడులో యోగాసనం

ఘనంగా యోగా దినోత్సవం

ఆకివీడు, జూన్‌ 21: ఆరోగ్యమే మహాభాగ్యమని యోగాసనాచార్య కందుల సత్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతంజలి యోగారోగ్య కేంద్రంలో సోమవారం సూర్యనమస్కారాలు, ఆసన, ప్రాణయామ, ధ్యానం నిర్వహించారు. నిజమైన ఆరోగ్యవంతుడే కోటీశ్వరుడన్నారు.   యోగా మెడిటేషన్‌ జిల్లా చైర్మన్‌ ఉండ్రమట్ల సాంబశివరావు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల శారీరక, మానసిక స్థితిగతులను బలోపేతం చేసి వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుందన్నారు. కార్యక్రమంలో పతంజలి యోగరోగ్య కేంద్ర కార్యదర్శి కుంకట్ల సత్యనారాయణ, పేర్ల నాగేశ్వరరావు, మల్లిఖార్జునరావు, మోటుపల్లి సత్తిరాజు, గోబేరు ప్రసాద్‌, పెంకి విజయ్‌కుమార్‌ దంపతులు, చొప్పెర్ల మహదేవన్‌, బ్రహ్మాజీ, మాటూరి అంజి, గోపాలకృష్ణ పాల్గొన్నారు.


భీమవరం ఎడ్యుకేషన్‌/అర్బన్‌/టౌన్‌ :  ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చిన కానుక యోగా అని భవన్స్‌ ప్రిన్సిపాల్‌ ఎల్‌వీ రమాదేవి అన్నారు. భారతీయ విద్యాభవన్స్‌, సోమవారం ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. కరోనా  పరిస్థితుల రిత్యా ఇళ్ల వద్దనే ఎన్‌సీసీ కేడెట్స్‌ యోగాసనాలు వేశారు. సీఎస్‌ఎన్‌ విద్యాసంస్థలో యోగా దినోత్సవం నిర్వహించారు. కళాశాల సెక్రటరీ చీడే సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌ సకుమళ్ళ సత్యనారాయణ యోగాతో ఆరోగ్యం ఏర్పడుతుందని తెలిపారు. శారీరకంగానే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందని ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ఎం.జగపతిరాజు అన్నారు. కళాశాల యోగా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. భీమవరం పోస్టాఫీస్‌లో ఆన్‌లైన్‌ ద్వారా తపాలశాఖ సిబ్బందికి పులపర్తి గోపాలం యోగా ఉపయోగాలను వివరించారు.ఎస్‌సీహెచ్‌ బీఆర్‌ఎం ఉన్నత పాఠశాలలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో యోగా వారోత్సవాలు నిర్వహించారు. 


నరసాపురం టౌన్‌ : పట్టణ, మండలంలో సోమవారం అంత ర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది.వైఎన్‌ కళాశాలలో వశిష్ఠ సేవాశ్రమ వ్యవస్థాపకులు(అంతర్వేది) తేజశ్విని విచ్చేసి అధ్యాపకులకు మెడి టేషన్‌పై శిక్షణ ఇచ్చారు.కార్యక్రమంలో కరస్పాండెంట్‌ంట్‌ డాక్టర్‌ చినమిల్లి సత్యనారా యణ, ప్రిన్సిపాల్‌ అప్పన ఫణి ఉన్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో టేలర్‌ హైస్కూల్‌ మైదానంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జీ కానూరి బుజ్జి అసనాలపై విద్యా ర్థులకు శిక్షణ ఇచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నేతలు యోగా సనాలు వేశారు. బీజీబీఎస్‌ మహిళా కళాశాలలో  ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అమ్మాజీ ,అధ్యాపకులు యోగాసనాలు వేశారు. 


పాలకొల్లు అర్బన్‌ : వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు యోగ ఎంతగానో ఉపయోగపడుతుందని వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి ఎం.సునీ తాదేవి అన్నారు. వీహెచ్‌పీ, బీజేపీ, వనితా వాకర్స్‌ క్లబ్‌,  డిఎన్‌ఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ  పట్టణాధ్యక్షుడు జక్కంపూడి కుమార్‌, యోగా కన్వీనర్లు గాదె బాబు, వర్ధినీడి నాగేశ్వరరావు, ఉన్నమట్ల కపరిఽ్ధ యోగా గురువులు గోనుగుంట రంగారావు, గమని ఆనంద్‌, కొణిజేటి గుప్త, కళ్యాణ్‌, నరసింహరాజు, సతీష్‌, వాకర్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ కర్ర జయ సరిత,ప్రిన్సిపాల్‌ నాగమణి పాల్గొన్నారు.


ఉండి : యోగాతోనే ఆరోగ్యం అని మాస్టారు ముదునూరి రామ రాజు అన్నారు. నరసాపురం పార్లమెంట్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పేరిచర్ల వెంకట శ్రీనివాసరాజు(సుభాష్‌) ఆధ్వర్యంలో ఉండి బిజెపి నాయకులు కొమ్మన నాగ బాబు నివాసం వద్ద యోగా దినోత్సవం నిర్వహించారు. 


కాళ్ళ : యోగాతో జీవనశైలిలో మార్పు తెచ్చుకోవచ్చని కోలనపల్లి సర్పంచ్‌ కె.సూర్యనారాయణమూర్తి అన్నారు. కోలనపల్లిలో యోగా సాధన చేశారు.ఈ కార్యక్రమంలో   కార్యదర్శి అరుణాదేవి, సిబ్బంది పాల్గొన్నారు. కాళ్ళలో కార్యదర్శి కె శివాజీ ఆధ్వర్యంలో  యోగా దినోత్సవం నిర్వహించారు. 


 వీరవాసరం : వీరవాసరంలో సంజీవని పిరమిడ్‌ కేర్‌ సెంటర్‌ను సోమవారం పిరమిడ్‌ సీనియర్‌ మాస్టర్‌ పిప్పళ్ళ ప్రసాదరావు ప్రారంభించారు.   కేర్‌ సెంటర్‌లో ప్రతీరోజు ఉచిత ధ్యాన శిక్షణ ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పిరమిడ్‌ స్పిరుచ్యువల్‌ సొసైటీ కన్వీనర్‌ కెవిడి ప్రసాద్‌, తీడ నాగరాజు, మేడిశెట్టి కృష్ణారావు, మద్దాల శ్రీరామకృష్ణ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


పెనుగొండ : ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్పవరం యోగా అని నవజ్యోతి యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యోగాచార్య చింతాకుల గోపాలకృష్ణ అన్నారు. నెహ్రూ యువ కేంద్రం ఆదేశాల మేరకు శ్రీ స్వామి వివేకానంద యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వడలి పడుగుల తోటలో యోగా దినోత్సవం నిర్వహించారు.దొడ్డిపట్ల గంగారత్నం, డి.నాగూర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T04:56:12+05:30 IST