
వాషింగ్టన్, ఏప్రిల్ 16: కరోనా మరణాలకు ప్రధాన కారణం.. శ్వాసకోస సమస్యలు తలెత్తడం! అయితే, క్రమంతప్పని వ్యాయామం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చని అమెరికాకు చెందిన వర్జీనియా వర్సిటీ అధ్యయనం చెబుతోంది. ‘ఒక్క పూట వ్యాయాయం చేసినా యాంటాక్సిడెంట్లు విడుదలవుతాయి. అవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను వేటాడంతో పాటు మానవ కణజాల రక్షణకు పాటుపడతాయి. తద్వారా కరోనా బారిన పడకుండా చూస్తాయ’ని అధ్యయనంలో పాల్గొన్న వర్జీనియా వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన జెన్ యాన్ పేర్కొన్నారు.