విల్లులాంటి వెన్ను కోసం...

ABN , First Publish Date - 2022-08-04T16:51:24+05:30 IST

వెన్ను వంకర ఉన్న వారికి కలిగే శారీరక అసౌకర్యం అంతా ఇంతా కాదు. ఈ ఇబ్బందిని అధిగమించడం

విల్లులాంటి వెన్ను కోసం...

వెన్ను వంకర ఉన్న వారికి కలిగే శారీరక అసౌకర్యం అంతా ఇంతా కాదు. ఈ ఇబ్బందిని అధిగమించడం కోసం యోగాసనాలను ఆశ్రయించవచ్చు. వెన్నులో అసౌకర్యాన్ని తొలగించే ఆ ఆసనాలు ఇవే! 


వెన్ను సాగదీయడం ప్రధానంగా యోగాభ్యాసం మొదలవుతుంది. ఇందుకోసం వేసే ఆసనాల వల్ల వెన్ను, పక్కటెముకలకు వ్యాయామం అంది, వెన్నులోని కండరాలలో ఒత్తిడి వదులుతుంది. వెన్నుపూసల మధ్య అసమతౌల్యం సర్దుకుని, ఒద్దిక ఏర్పడడానికి యోగాలో కొన్ని ఆసనాలు ఉపరిస్తాయి. అవేంటంటే...


బితిలాసనం 

  • బల్లను పోలిన ఆకారంలోకి మారాలి.
  • మోకాళ్లు, అరచేతుల ఆధారంగా టేబుల్‌ భంగిమలోకి మారాలి.
  • ఈ భంగిమలో తలను నెమ్మదిగా పైకి లేపి ఆకాశాన్ని చూడాలి.
  • శ్వాస పీల్చుకుని, కొన్ని క్షణాల పాటు ఊపిరి ఆపి ఉంచాలి.
  • ఇలా నాలుగు సార్లు శ్వాస పీల్చి వదిలిన తర్వాత తిరిగి తలను దించాలి.
  • ఇలా దించేటప్పుడు లోతుగా వంచిన వెన్నును పైకి లేపాలి. 
  • తలను మరింత కిందకు ఛాతీ వైపు వంచాలి.
  • ఇలా వెన్నును వంచుతూ, లేపుతూ ఈ ఆసనాన్ని ముగించాలి.


బాలాసనం

  • మెకాళ్లు మడిచి నేల మీద కూర్చోవాలి. 
  • ఈ భంగిమలో మడిచిన పాదాలు పిరుదులను తాకేలా ఉండాలి.
  • తర్వాత చేతులను చాపి, ముందుకు వంగాలి.
  • ఇలా వంగినప్పుడు ముఖం, ఛాతీ, అరచేతులు నేలను తాకాలి.
  • ఈ భంగిమలో కొన్ని క్షణాలు ఉండి, నెమ్మదిగా పైకి లేవాలి. 
  • ఈ ఆసనంతో వెన్నులో ఒత్తిడి తొలగి, కండరాలకు స్వాంతన చేకూరుతుంది. 

Updated Date - 2022-08-04T16:51:24+05:30 IST