యోగా ఇలా సరి కాదు

ABN , First Publish Date - 2021-09-14T05:30:00+05:30 IST

యోగాసనాలు నిస్సందేహంగా ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అయితే యోగసాధన సమయంలో కొన్ని చేయకూడనివీ ఉంటాయి. అవేంటంటే...

యోగా ఇలా సరి కాదు

యోగాసనాలు నిస్సందేహంగా ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అయితే యోగసాధన సమయంలో కొన్ని చేయకూడనివీ ఉంటాయి. అవేంటంటే...


  1. శరీరాన్ని విపరీతమైన ఒత్తిడికి లోను చేయకూడదు. కొన్నిసార్లు సులభమైనవి క్లిష్టంగా తోచవచ్చు. మరికొన్ని సందర్భాల్లో క్లిష్టమైనవి సులభంగా అనిపించవచ్చు. కాబట్టి శరీరం మాట వింటూ నడుచుకోవాలి.
  2. అనవసరంగా ఊపిరి బిగపట్టి ఉంచకూడదు. శిక్షకులు చెప్పినప్పుడు, ఆసనానికి తగ్గట్టు ఊపిరి పీల్చుకుంటూ, బిగపడుతూ, వదులుతూ ఉండాలి.
  3. ప్రారంభంలో శిక్షకుల పర్యవేక్షణ లేకుండా ఒంటరిగా ఆసనాలు సాధన చేయకపోవడమే మేలు. టివిలో చూసినవి, పుస్తకాల్లో చదివినవి సొంతగా సాధన చేయకూడదు. కండరాలు పట్టేయడం, శారీరక అసౌకర్యం లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే శిక్షకుల పర్యవేక్షణలో సాధన చేస్తూ, పట్టు పెంచుకోవాలి.
  4. బిగుతైన దుస్తులు, షూ ధరించకూడదు. మరీ ముఖ్యంగా బిగుతైన దుస్తుల వల్ల నడుము పైభాగం కదలికలు ఇబ్బందికరంగా మారతాయి. ఛాతీ వ్యాకోచించే వీలు లేక ఊపిరి తీసుకోవడం, వదలడంలో అసౌకర్యం తలెత్తుతుంది.
  5. మహిళలు నెలసరి సమయంలో తలకిందులుగా ఉండే ఆసనాలు వేయకూడదు. బదులుగా రిలాక్సేషన్‌, శ్వాసకు సంబంధించిన ఆసనాలు సాధన చేయాలి.

Updated Date - 2021-09-14T05:30:00+05:30 IST