Saudi Arabia: స్కూళ్లలో క్రీడగా 'యోగా'

ABN , First Publish Date - 2022-03-15T17:40:53+05:30 IST

సౌదీ అరేబియాలోని స్కూళ్లలో త్వరలో యోగాను క్రీడగా పరిచయం చేయనున్నట్లు సౌదీ యోగా కమిటీ(ఎస్‌వైసీ) అధ్యక్షుడు నౌఫ్ అల్ మార్వాయీ తెలిపారు.

Saudi Arabia: స్కూళ్లలో క్రీడగా 'యోగా'

రియాద్: సౌదీ అరేబియాలోని స్కూళ్లలో త్వరలో యోగాను క్రీడగా పరిచయం చేయనున్నట్లు సౌదీ యోగా కమిటీ(ఎస్‌వైసీ) అధ్యక్షుడు నౌఫ్ అల్ మార్వాయీ తెలిపారు. యోగాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో విద్యా మంత్రిత్వశాఖ సమన్వయంతో కింగ్‌డమ్‌లోని అన్ని స్కూళ్లలో దీన్ని క్రీడగా తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే విషయమై మార్చి 9న జరిగిన ఎస్‌వైసీ, సౌదీ స్కూల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సమావేశంలో పాఠశాలల్లో యోగాకు దేశవ్యాప్త మద్దతుపైనే ఉపన్యాసం కొనసాగిన్లు తెలిపారు. ఈ సమావేశంలో దేశంలోని అన్ని స్కూళ్ల ప్రిన్సిపాల్స్‌తో పాటు ఆయా పాఠశాలల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే స్కూళ్లలో యోగాను క్రీడాగా పరిచయం చేసేందుకు ప్రణాళిక పూర్తైనట్లు ఈ సందర్భంగా మార్వాయీ ప్రకటించారు. ఇక సౌదీ మనిస్ట్రీ ఆఫ్ కామర్స్ దేశంలో యోగా టీచింగ్, యోగా చేసేందుకు 2017 నవంబర్‌లో ఆమోదించింది. అప్పటి నుంచి కింగ్‌డమ్‌లో యోగాకు సమూచిత స్థానం లభిస్తోంది. నెమ్మదిగా అక్కడి స్థానికులు కూడా యోగాపై మక్కువ చూపిస్తున్నారు.  



Updated Date - 2022-03-15T17:40:53+05:30 IST