సేవను గొప్పగా నిర్వచించిన యోగేశ్ చితాడే దంపతులు

ABN , First Publish Date - 2020-11-27T22:01:45+05:30 IST

‘భారతదేశ పునరుజ్జీవనం’ అనే అంశంపై నగరంలోని రామకృష్ణ మఠ్‌కు చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ వెబినార్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

సేవను గొప్పగా నిర్వచించిన యోగేశ్ చితాడే దంపతులు

‘భారతదేశ పునరుజ్జీవనం’ అనే అంశంపై నగరంలోని రామకృష్ణ మఠ్‌కు చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ వెబినార్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమయానంద నేతృత్వంలో జరిగే ఈ వెబినార్‌‌లో దేశవ్యాప్తంగా పలు రంగాల్లో నిష్ణాతులైన వారు వక్తలుగా పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా వచ్చే ఆదివారం ‘సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ ఫర్ ఏ రిసర్జంట్ ఇండియా’ పేరుతో చర్చా గోష్టి నిర్వహిస్తున్నారు. ఈ వెబినార్‌కు పూణేకు చెందిన సిర్ఫ్(ఎస్ఐఆర్ఎఫ్) సంస్థ వ్యవస్థాపకులు, వైమానిక దళ మాజీ అధికారి యోగేశ్ చితాడే, ఆయన సతీమణి ఉపాధ్యాయురాలు సుమేధ చితాడే ముఖ్య అతిథులు. నవంబర్ 29న ఉదయం 11.00 గంటలకు వెబినార్ ప్రారంభం కానుంది. జూమ్ యాప్ ద్వారా వెబినార్‌లో పాల్గొనవచ్చు.     


సిర్ఫ్(ఎస్ఐఆర్ఎఫ్) అంటే ‘సోల్జర్స్ ఇండిపెండెంట్ రిహాబిలిటేషన్ పౌండేషన్’. త్యాగధనులైన సైనికుల కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన నుంచి ఉద్భవించిన సంస్థ ఇది. సైనికుల పట్ల అభినందనతో, గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా, మద్దతుగా నిలవాలన్న నాలుగు లక్ష్యాలతో ఈ సంస్థను యోగేశ్ స్థాపించారు. ఈ విషయాన్నే చాటుతూ ఆయన పలుకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేను అనే స్వార్థాన్ని పక్కన పెట్టి ముందు సేవ చేయాలి అంటుంటారు యోగేశ్.    


మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు. 


రామకృష్ణ మఠం పని వేళలు: ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Updated Date - 2020-11-27T22:01:45+05:30 IST