యోగి కొత్త కేబినెట్‌లో 65 ఏళ్లు దాటినవారికి మంత్రి పదవులు డౌటే!

ABN , First Publish Date - 2022-03-17T19:26:52+05:30 IST

లక్నో: యోగి ఆదిత్యనాథ్ కొత్త కేబినెట్‌లో 65 ఏళ్లు దాటిన వారికి మంత్రి పదవుల్లేనట్లేనని తెలుస్తోంది.

యోగి కొత్త కేబినెట్‌లో 65 ఏళ్లు దాటినవారికి మంత్రి పదవులు డౌటే!

లక్నో: యోగి ఆదిత్యనాథ్ కొత్త కేబినెట్‌లో 65 ఏళ్లు దాటిన వారికి మంత్రి పదవులు లేనట్లేనని తెలుస్తోంది. దీనికి సంబంధించి పార్టీలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో యువతకు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. జాట్, పటేల్ వర్గాల వారికి మంత్రి పదవులు ఖాయమని ప్రచారం జరుగుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను మళ్లీ కేబినెట్‌లోకి తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. లక్నోలోని ఇకానా స్టేడియంలో యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 19 తర్వాత జరగొచ్చని తెలుస్తోంది. 45 వేల మంది సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ఎన్డీయే నేతలు సహా మొత్తం 200 మంది వీవీఐపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరౌతారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రమాణానికి హాజరవ్వాలంటూ సోనియా, రాహుల్, ప్రియాంక, ములాయం, అఖిలేష్, మాయావతికి కూడా ఆహ్వానం పంపినట్లు సమాచారం. మరోవైపు హోలీ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ చేరుకున్నారు. గోరఖ్‌నాథ్ మందిరంలో నిర్వహించే హోలీ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా 8 కిలోమీటర్ల శోభాయాత్ర కూడా నిర్వహిస్తారని సమాచారం.


ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గాను బీజేపీ సొంతంగా 255 స్థానాలు గెలుచుకుంది. మిత్రపక్షాలైన అప్నాదళ్ 12, నిషాద్ పార్టీ 6 స్థానాల్లో గెలుపొందాయి. 

Updated Date - 2022-03-17T19:26:52+05:30 IST