
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుక కోసం లక్నోలోని ఎకానా స్టేడియాన్ని ముస్తాబు చేశారు. యోగి ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా లక్నో నగరాన్ని కాషాయమయం చేశారు. నాలుగు దశాబ్దాల తర్వాత రెండోసారి విజయం సాధించిన బీజేపీ అధికారం చేపట్టనుంది. ఈ సందర్భంగా లక్నో నగరంలో కాషాయరంగు పోస్టర్లు, బ్యానర్లు, జెండాలు, కాషాయవస్త్రాలతో అందంగా ముస్తాబు చేశారు.ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ సీఎంలు ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, మాయావతిలకు సీఎం యోగి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు.
బడా పారిశ్రామికవేత్తలైన కుమార్ మంగళం బిర్లా, ఆనంద్ మహీంద్రాలకు కూడా యోగి ఆహ్వానించారు.ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, పారిశ్రామికవేత్తలకు యోగి ఆహ్వానాలు పంపారు.ఈ వేడుకకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పుష్కర్ సింగ్ ధామి, బసవరాజ్ బొమ్మై, నితీష్ కుమార్, మాజీ సీఎంలు రమణ్ సింగ్, రఘుబర్ దాస్,కేంద్రమంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, నరేంద్ర సింగ్ తోమర్, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, భూపేంద్ర యాదవ్, మహేంద్ర నాథ్ పాండే, స్మృతి ఇరానీ, హర్దీప్ సింగ్ పూరి, అన్నపూర్ణ యాదవ్, శోభా కరంజలే ఈ వేడుకకు హాజరుకానున్నారు.
ఈ వేడుక సందర్భంగా ఎకానా స్టేడియంలో తాత్కాలిక అత్యాధునిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. పడకలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో 100 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రముఖులకు చికిత్స అందించేందుకు వైద్యుల బృందాలను కూడా నియమించారు.వేడుకకు పాస్‌లు ఉన్న వారికి మాత్రమే ప్రవేశం పరిమితం చేశారు. మిగతా వారందరికీ బయట పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి