
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆయన క్యాబినెట్ సహచరుడు షాక్ ఇచ్చారు. కార్మిక, ఉపాధి శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి మంగళవారంనాడు రాజీనామా చేశారు. దళితులు, వెనుకబడిన తరగతులు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్నతరహా పరిశ్రమలపై యూపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా తాను రాజీనామా చేసినట్టు మౌర్య తెలిపారు.
ఇవి కూడా చదవండి
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో మరో అదనపు సీటు కావాలని మౌర్య డిమాండ్ చేశారని, అందుకు పార్టీ సిద్ధంగా లేకపోవడంతోనే ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారు. కాగా, స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేసిన వెంటనే ఆయనతో కలిసి ఉన్న ఓ ఫోటోను సమాజ్‌వాదీ పార్టీ నేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ షేర్ చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాటం జరుపుతున్న పాపులర్ నేత స్వామి ప్రసాద్ మౌర్య, అతని సహచరులకు స్వాగతం పలుకుతున్నట్టు ట్వీట్ చేశారు.