ఆస్తులు ప్రకటించండి: మంత్రులకు యోగి ఆదేశం

ABN , First Publish Date - 2022-04-27T00:07:59+05:30 IST

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గ సహచరులకు తాజా..

ఆస్తులు ప్రకటించండి: మంత్రులకు యోగి ఆదేశం

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గ సహచరులకు తాజా ఆదేశాలిచ్చారు. మంత్రులు తమ సొంత ఆస్తులతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను మూడు నెలల్లోగా ప్రకటించాలని ఆదేశించారు. యోగి ఆదిత్యనాథ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు. లిక్విడ్ క్యాష్, బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో తనకు రూ.1.54 కోట్ల ఆస్తులున్నట్టు అందులో యోగి డిక్లేర్ చేశారు.


యోగి ఆదిత్యనాథ్ గత మార్చి 25న వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 52 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యాంగం ప్రకారం, యూపీ అసెంబ్లీకి సీఎం సహా 60 మంది వరకూ మంత్రులు ఉండొచ్చు. దీనికి ముందు 2017లో ఆయన ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసిన వెంటనే మంత్రులందరూ ఏటా మార్చి 31లోగా తమ ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశించారు. రూ.5 వేలకు పైబడిన ఎలాంటి గిఫ్ట్‌లు తీసుకోవద్దని, విలాసవంతమైన నివాసాలకు, పార్టీలు, డిన్నర్లకు దూరంగా ఉండాలని చెప్పారు.

Updated Date - 2022-04-27T00:07:59+05:30 IST