లౌడ్ స్పీకర్లు తొలగించినందుకు యోగికి రాజ్‌థాకరే ధన్యవాదాలు

ABN , First Publish Date - 2022-04-28T20:28:32+05:30 IST

ముంబై: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌థాకరే ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రార్ధనా స్థలాల నుంచి లౌడ్ స్పీకర్లు తొలగించినందుకు

లౌడ్ స్పీకర్లు తొలగించినందుకు యోగికి రాజ్‌థాకరే ధన్యవాదాలు

ముంబై: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌థాకరే ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రార్ధనా స్థలాల నుంచి లౌడ్ స్పీకర్లు తొలగించినందుకు అభినందనలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. అయితే తమ మహారాష్ట్రలో మాత్రం యోగి లాంటి నేతలు లేరని, అంతా భోగులే ఉన్నారని మహారాష్ట్ర పాలకులను ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో కూడా వెంటనే ప్రార్ధనా స్థలాల నుంచి లౌడ్ స్పీకర్లు తొలగిస్తే బాగుంటుందని రాజ్‌థాకరే సూచించారు. 





యూపీలో రెండు, మూడు రోజులుగా మందిరాలు, చర్చ్‌లు, గురుద్వారాలు, మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగిస్తున్నారు. ప్రార్ధనా స్థలాల నుంచి వచ్చే శబ్దం ఆయా ప్రార్ధనా స్థలాల ప్రాంగణం దాటి వినపడకుండా నిర్వాహక కమిటీలు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. 




మే మూడు నాటికి మహారాష్ట్రలో మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే తాము మసీదుల బయట హనుమాన్ చాలీసా చదువుతామని రాజ్‌థాకరే ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రార్ధనలు ఇళ్లలోనే చేసుకోవాలని, రోడ్లపైకి వస్తే ఊరుకోబోమని కూడా రాజ్‌థాకరే హెచ్చరించారు. దీంతో మహారాష్ట్ర్లలో ఒక్కసారిగా కలకలం రేగింది. రాజకీయాలు వేడెక్కాయి. లౌడ్ స్పీకర్లు తొలగించాలనే అంశంపై అధికార పక్షాలు, ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. 

Updated Date - 2022-04-28T20:28:32+05:30 IST