Darul Uloom Deoband వెబ్‌సైట్‌‌పై నిషేధాస్త్రం

ABN , First Publish Date - 2022-02-08T18:17:17+05:30 IST

బాలల హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఫత్వాలు జారీ చేసినందుకు గాను యోగి ప్రభుత్వం దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ వెబ్‌సైట్‌ను నిషేధించింది...

Darul Uloom Deoband వెబ్‌సైట్‌‌పై నిషేధాస్త్రం

యోగి సర్కారు నిర్ణయం

లక్నో: బాలల హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఫత్వాలు జారీ చేసినందుకు గాను యోగి ప్రభుత్వం దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ వెబ్‌సైట్‌ను నిషేధించింది.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సహరాన్‌పూర్ జిల్లాలోని దేవబంద్‌లోని ఇస్లామిక్ సెమినరీ దారుల్ ఉలూమ్ అధికారిక వెబ్‌సైట్‌ను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిషేధించింది. దత్తత తీసుకున్న పిల్లలకు  తల్లిదండ్రుల ఆస్తిపై చట్టపరమైన హక్కుల సమస్యపై విచారణ జరపాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ జిల్లా మేజిస్ట్రేట్ అఖిలేష్ సింగ్ ను కోరింది.దీంతో జిల్లా మెజిస్ట్రేట్ అఖిలేష్ సింగ్ ఈ నిషేధాన్ని విధించారు. ఈ సమస్యపై స్థానిక నివాసి ఫిర్యాదు మేరకు ఎన్‌సిపిసిఆర్ సహరాన్‌పూర్ డిఎంను విచారణ జరపాలని కోరింది.


Updated Date - 2022-02-08T18:17:17+05:30 IST