యోగి ప్రభుత్వం అన్నింటా విఫలం: కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-06-23T05:24:04+05:30 IST

యోగి ప్రభుత్వం అన్నింటా విఫలం: కాంగ్రెస్

యోగి ప్రభుత్వం అన్నింటా విఫలం: కాంగ్రెస్

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. యూపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ ఇవాళ ఓ ప్రకటనలో స్పందిస్తూ... ‘‘ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని అంశాల్లో పూర్తిగా విఫలమైంది. కొవిడ్-19 సంక్షోభం సమయంలో ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంది. నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరిగినప్పటికీ.. ఇప్పటి వరకు కనీసం ఒక్క నియామకం కూడా చేపట్టలేదు..’’ అని పేర్కొన్నారు. కాగా వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నదానిపై ఇవాళ యూపీ కాంగ్రెస్ సమావేశమైంది. పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:24:04+05:30 IST