ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం యోగి

ABN , First Publish Date - 2022-03-13T23:38:50+05:30 IST

మౌర్యతో పాటు మరో 10 మంది మంత్రులు ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. అయితే మౌర్యకు మినహా మిగతా ఎవరికీ మంత్రి మండలిలో స్థానం దక్కేలా లేదని తెలుస్తోంది. ఆయనను మాత్రం మండలి టికెట్ ఇచ్చైనా మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు..

ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం యోగి

న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలుసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రధాని నివాసానికి స్వయంగా వెళ్లిన యోగి.. రాష్ట్రంలో తొందరలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం గురించి, కెబినెట్ కూర్పు గురించి ప్రధానితో చర్చించినట్లు సమాచారం. అలాగే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మోదీని కోరినట్లు ప్రధాని నివాస వర్గాలు వెల్లడించాయి. ఇద్దరు గంటలకు పైగా చర్చ చేశారు. తొందరలో ఏర్పడబోయే ప్రభుత్వంలో కెబినెట్ కూర్పు గురించి మోదీతో యోగి ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో యోగి తర్వాత పార్టీకి ముఖ్యనేతగా ఉన్న ఉప ముఖ్యమంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఎన్నికల్లో ఓడిపోయారు.


మౌర్యతో పాటు మరో 10 మంది మంత్రులు ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. అయితే మౌర్యకు మినహా మిగతా ఎవరికీ మంత్రి మండలిలో స్థానం దక్కేలా లేదని తెలుస్తోంది. ఆయనను మాత్రం మండలి టికెట్ ఇచ్చైనా మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక యోగి ప్రభుత్వంలోని రెండవ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ.. ఈ ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు. దీంతో ఆయనను కూడా పక్కన పెట్టేస్తున్నారని అనుకుంటున్నారు. ఇక కొత్త మార్పుల్లో దళిత వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈసారి కేబినెట్‌లో సమాజిక వర్గాల వారీ కేటాయింపులు పక్కా చేపట్టనున్నారని, ఆ విషయమయ్యే మోదీని యోగి కలుసుకున్నట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి.

Updated Date - 2022-03-13T23:38:50+05:30 IST