శాసన మండలికి యోగి రాజీనామా

ABN , First Publish Date - 2022-03-23T00:30:25+05:30 IST

ఉత్తరప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర శాసన మండలికి..

శాసన మండలికి యోగి రాజీనామా

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర శాసన మండలికి రాజీనామా చేశారు. ఈనెల 25న ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కావడంతో రాష్ట్ర శాసన మండలికి తాజాగా రాజీనామా చేశారు. 2017 వరకూ ఆయన గోరఖ్‌పూర్ నియోజకవర్గానికి పలు మార్లు ప్రాతినిధ్యం వహించారు. గత 37 ఏళ్లలో యూపీలో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని, మళ్లీ అధికార పగ్గాలు చేపడుతున్న తొలి ముఖ్యమంత్రిగా యోగి రికార్డు సృష్టించనున్నారు. అదే విధంగా తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో యోగి గెలుపొందటం మరో విశేషం. 403 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ సొంతంగా 255 సీట్లతో సంపూర్ణ ఆధిక్యం సాధించడంతో పాటు 41.29 శాతం ఓట్ షేర్ సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ 111 సీట్లతో ప్రధాన విపక్షానికే పరిమితమైంది.

Updated Date - 2022-03-23T00:30:25+05:30 IST