Advertisement

టాప్‌ కమెడియన్‌ కీలక పాత్రలో ‘గంగాదేవి’

Feb 26 2021 @ 20:09PM

కోలీవుడ్: ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో ‘గంగాదేవి’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రీకరుణై ఆనందా మూవీస్‌ బ్యానర్‌పై ‘చండిముని’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన మిల్కా సెల్వకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈయన గతంలో దర్శకనిర్మాత, హీరో రాఘవ లారెన్స్‌ వద్ద సహాయ దర్శకుడుగా పనిచేశారు. పైగా తన తొలి చిత్రంతోనే అందిరి మన్ననలు పొందారు. ఇప్పుడు ఓ స్టార్‌ హీరోతో కలిసి, యోగిబాబు ప్రధాన పాత్రలో ‘గంగాదేవి’ అనే పేరుతో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. సీనియర్‌ ఫైట్‌మాస్టర్‌ సూపర్‌ సుబ్బరాయన్‌ విలన్‌గా నటించే ఈ చిత్రంలో శామ్స్‌, ఆర్తి గణేష్‌ వంటి మరికొంతమంది హాస్య నటులను ఎంపిక చేశారు. 


ఈ చిత్రంపై దర్శకుడు మిల్కా సెల్వకుమార్‌ స్పందిస్తూ, హీరోయిన్‌ పాత్రకు అధిక ప్రాధాన్యం ఇచ్చే కథతో ఈ చిత్రం సాగుతుందని, ఇందులో గంగ - దేవి అనే రెండు పాత్రల్లో హీరోయిన్‌ నటిస్తుందన్నారు. ప్రముఖ క్రీడను నేపథ్యంగా చేసుకుని సస్పెన్స్‌, థ్రిల్లర్‌, హారర్‌, కామెడీ ఇలా అన్ని జానర్లను టచ్‌ చేస్తూ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ‘నెంజం మరప్పదిల్లై’ చిత్ర కథలాగే, ఈ చిత్ర కథ కూడా పూర్వజన్మల నేపథ్యంగా సాగుతుందన్నారు.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.