స్నేహం కోసం యోగిబాబు పెద్దమనసు

Apr 19 2021 @ 08:15AM

కొంతమంది నటీనటులు స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తర్వాత పాత మిత్రులను మరచిపోతుంటారు. మరికొందరు మాత్రం తమ స్నేహాన్ని ఎన్నటికీ మరచిపోరు. అలాంటి వారిలో యోగిబాబు ఒకరు. ఎంతో బిజీ షెడ్యూల్‌లో కూడా తన స్నేహితుల కోసం సినిమా ప్రచార పాటలో నటించారు. ఇందుకోసం ఒక్క పైసా రెమ్యునరేషన్‌ తీసుకోలేదు. పైగా షూటింగ్‌ స్పాట్‌లో కారవాన్‌ సౌకర్యాన్ని కూడా తిరస్కరించారు. ‘వళక్కు ఎన్‌’, ‘తనీ ఒరువన్‌’, ‘దిల్లుక్కు దుడ్డు’తో సహా దాదాపు 25కి పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గోపికృష్ణ, డాక్టర్‌ రేవతి రంగస్వామి సంయుక్తంగా నిర్మి స్తున్న చిత్రం ‘‘నాయే పేయే’’. డ్యాన్స్‌ మాస్టర్‌ దినేష్‌ హీరోగా నటి స్తున్న ఈ చిత్రానికి శక్తివాసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య, ఆడుకళం మురుగదాస్‌, పూచ్చి బాబు, రోకేష్‌, క్రిష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిజానికి ఈ చిత్రంలో ప్రధాన పాత్రను హాస్య నటుడు యోగిబాబు చేయాల్సి ఉంది. కానీ బిజీ షెడ్యూల్‌ కారణంగా తన కాల్షీట్లను సర్దుబాటు చేయలేకపోయారు. 

 

అయినప్పటికీ ఈ చిత్రం ప్రచారం కోసం చేసిన సాంగ్‌లో నటించారు. ఈ పాట వీడియోను రిలీజ్‌ చేయగా మంచి విజ యాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం గురించి గోపికృష్ణ మాట్లా డుతూ, ఈ చిత్రంలోని ఓ ముఖ్యమైన పాత్రలో యోగిబాబును నటింపజేసేందుకు ఎంతగానో శ్రమించాం. కానీ, అది సాధ్య పడలేదు. దీంతో ఆ పాత్రకు మురుగదాస్‌ను ఎంపిక చేశాం. అయితే, ఈ చిత్రంలో తన భాగస్వామ్యం కొంతైనా ఉండాలన్న ఉద్దేశ్యంతో యోగిబాబు ఈ ప్రచార పాటలో నటించారు. ఇందు కోసం ఒక రోజంతా తమతోనే షూటింగ్‌ స్పాట్‌లో ఉన్నారు. ఒక్క పైసా కూడా  తీసుకోలేదు. అలాగే, మరికొంతమంది నటులు కూడా పారితోషికం తీసుకోకుండానే నటించారు. దీనికి కారణం... తమమధ్య ఉన్న స్నేహం. ఆ స్నేహంకోసం యోగిబాబు ఈ చిత్రానికి తనవంతు సాయం చేశారని గోపికృష్ణ వివరించారు.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.