దహీ అంజీర్‌ కబాబ్‌

ABN , First Publish Date - 2020-05-30T17:40:18+05:30 IST

అంజీర్‌ - 100గ్రాములు, పెరుగు - పావుకేజీ, పనీర్‌ - 400గ్రాములు, సెనగపిండి(వేగించినది) - 150గ్రాములు, బ్రెడ్‌ ముక్కలు - 150గ్రాములు

దహీ అంజీర్‌ కబాబ్‌

కావలసినవి: అంజీర్‌ - 100గ్రాములు, పెరుగు - పావుకేజీ, పనీర్‌ - 400గ్రాములు, సెనగపిండి(వేగించినది) - 150గ్రాములు, బ్రెడ్‌ ముక్కలు - 150గ్రాములు, అల్లం - 50గ్రాములు, పచ్చిమిర్చి - 25గ్రాములు, కొత్తిమీర - 50 గ్రాములు, నెయ్యి - 200గ్రాములు, గరంమసాలా - 40 గ్రాములు, యాలకుల పొడి - 15 గ్రాములు, జీలకర్రపొడి(వేగించినవి) - 10 గ్రాములు, ఉప్పు - తగినంత.


తయారీ: ఒక పాత్రలో పెరుగు తీసుకొని అందులో పనీర్‌, అల్లం, పచ్చిమర్చి, కొత్తిమీర, గరంమసాలా, యాలకుల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత సెనగపిండి, బ్రెడ్‌ ముక్కలు వేసి చేత్తో నెమ్మదిగా మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండను వెడల్పుగా చేసుకుంటూ మధ్యలో అంజీర్‌ పెట్టి ఒత్తుకోవాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక కబాబ్‌లు వేసి వేగించాలి. ఈ కబాబ్‌లను పుదీనా చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2020-05-30T17:40:18+05:30 IST