ఇకనైనా ఆపండి! మీరేమీ ఆవులు, గుర్రాలు కాదు.. ఔషధ నియంత్రణ సంస్థ వ్యాఖ్య

ABN , First Publish Date - 2021-08-23T00:21:37+05:30 IST

కరోనా చికిత్స కోసం అమెరికా ప్రజలు ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని అధికంగా వినియోగిస్తుండటంపై అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇకనైనా ఆపండి! మీరేమీ ఆవులు, గుర్రాలు కాదు.. ఔషధ నియంత్రణ సంస్థ వ్యాఖ్య

వాషింగ్టన్: కరోనా చికిత్స కోసం అమెరికా ప్రజలు ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని అధికంగా వినియోగిస్తుండటంపై అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. దీని వాడకాన్ని వెంటనే మానుకోవాలంటూ ప్రజలకు సూచించింది. ‘‘మీరేమీ ఆవులు, గుర్రాలు కాదు. కరోనా చికిత్స కోసం ఐవర్‌మెక్టిన్‌ను వాడటం మానండి. మేం ఐవర్‌మెక్టిన్‌ను కరోనా చికిత్సగా వినియోగించేందుకు అనుమతించలేదు. ఇకనైనా ఆపండి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమెరికాలో సాధారణంగా జంతుసంబంధింత వ్యాధులను అరికట్టేందుకు ఐవర్‌మెక్టిన్‌ను వినియోగిస్తుంటారు. 

Updated Date - 2021-08-23T00:21:37+05:30 IST