కొవిడ్ ఎఫెక్ట్.. ఆ ఔషధాన్ని ఎక్కువగా వినియోగిస్తున్న అమెరికన్లు.. ఎఫ్‌డీఏ ఆందోళన!

ABN , First Publish Date - 2021-08-23T04:36:27+05:30 IST

కరోనా చికిత్స కోసం అమెరికా ప్రజలు ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని అధికంగా వినియోగిస్తుండటంపై యూఎస్ ఎఫ్‌డీఏ తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. దీని వాడకాన్ని వెంటనే మానుకోవాలంటూ ప్రజలకు సూచించింది. ‘

కొవిడ్ ఎఫెక్ట్.. ఆ ఔషధాన్ని ఎక్కువగా వినియోగిస్తున్న అమెరికన్లు.. ఎఫ్‌డీఏ ఆందోళన!

వాషింగ్టన్: కరోనా చికిత్స కోసం అమెరికా ప్రజలు ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని అధికంగా వినియోగిస్తుండటంపై యూఎస్ ఎఫ్‌డీఏ తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. దీని వాడకాన్ని వెంటనే మానుకోవాలంటూ ప్రజలకు సూచించింది. ‘‘మీరేమీ ఆవులు, గుర్రాలు కాదు. కరోనా చికిత్స కోసం ఐవర్‌మెక్టిన్‌ను వాడటం మానండి. మేం ఐవర్‌మెక్టిన్‌ను కరోనా చికిత్సగా వినియోగించేందుకు అనుమతించలేదు. ఇకనైనా ఆపండి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమెరికాలో సాధారణంగా జంతుసంబంధింత వ్యాధులను అరికట్టేందుకు ఐవర్‌మెక్టిన్‌ను వినియోగిస్తుంటారు. 


Updated Date - 2021-08-23T04:36:27+05:30 IST