మీరే హీరో

Published: Thu, 18 Aug 2022 07:08:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మీరే హీరో

సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతిశెట్టి కథానాయిక. బి మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 16న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని ‘మీరే హీరో’ అంటూ సాగే గీతాన్ని యూనిట్‌ బుధవారం విడుదల చేసింది. రామజోగయ్య సాహిత్యానికి వివేక్‌ స్వరాలు సమకూర్చారు. ఇంద్రగంటి కథకు న్యాయం చేసే దర్శకుడు, కృతి ఈ సినిమాతో టాలీవుడ్‌లో స్థిరపడిపోతుంది అని సుధీరబాబు అన్నారు. వివేక్‌ ఈ పాటను అద్భుతంగా కంపోజ్‌ చేశారు, సుధీర్‌ నటన మరో స్థాయిలో ఉంటుందని ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ చెప్పారు. నటనకు ఆస్కారమున్న పాత్ర పోషించాను అని కృతిశెట్టి తెలిపారు. దర్శకుడు హను రాఘవపూడి ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International