Lion cheaper than a buffalo : బంపరాఫర్.. లక్షన్నరకే సింహం.. గేదె కంటే చీప్ రేటు

ABN , First Publish Date - 2022-07-30T01:33:04+05:30 IST

రండి బాబూ రండి.. గేదె (buffalo) కంటే చీప్‌గా సింహం(Lion) ధర. 12 సింహాలే ఉన్నాయి. మంచి తరుణం మించినా దొరకదు... ఇదేం ప్రకటనరా బాబు?.. నిజమేనా? అని సందేహిస్తున్నారా?.

Lion cheaper than a buffalo : బంపరాఫర్.. లక్షన్నరకే సింహం.. గేదె కంటే చీప్ రేటు

లాహార్ : రండి బాబూ రండి.. గేదె (buffalo) కంటే చీప్‌గా సింహాలు(Lions). 12 సింహాలే ఉన్నాయి. మంచి తరుణం మించినా దొరకదు... ఆ..  ఇదేం ప్రకటనరా బాబు అని నోరెళ్లబెడుతున్నారా?.. సింహాన్ని ఎవరైన అంత తక్కువ రేటుకు అమ్ముతారా ? అని సందేహిస్తున్నారా.. కానీ ఇది నిజంగా నిజం. పొరుగు దేశం పాకిస్తాన్‌(Pakistan)లోని లాహోర్ సఫారీ జూ( Lahore Safari Zoo) ఒక్కో సింహాన్ని రూ.1.5 లక్షల(పాకిస్తానీ కరెన్సీ) తక్కువ ధరకు విక్రయించాలనుకుంటుంది. మొత్తం 12 సింహాలను అమ్మకానికి (Selling) రెడీగా ఉంచినట్టు పాకిస్తానీ ‘సమా టీవీ’ (Samaa TV) రిపోర్ట్ పేర్కొంది. నిధుల సేకరణ దృష్ట్యా ఆగస్టు తొలి వారంలో వీటిని  జూ నిర్వాహకులు అమ్మనున్నారని పేర్కొంది.


జూలో మొత్తం 40 సింహాలు ఉన్నాయి. 12 సింహాలు అమ్మకానికి ఉంచగా అందులో 3 ఆడవి ఉన్నాయి.  ప్రైవేటు హౌసింగ్ స్కీమ్స్ లేదా జంతు పోషక ఔత్సాహికులకు వీటిని విక్రయించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కాగా లాహోర్ సఫారీ జూ మొత్తం 142 ఎకరాల్లో విస్తరించి ఉంది. వన్య మృగాలను కూడా ఇక్కడ సంరక్షిస్తున్నారు. అయితే వీటి నిర్వహణ, వ్యయాలు కష్టంగా మారిపోవడంతో సింహాలు విక్రయించాలని నిర్వాహకులు భావించారు. అందులో భాగమే ఈ 12 సింహాలను విక్రయమని రిపోర్ట్ పేర్కొంది. కాగా వ్యయాల సమకూర్చుకునేందుకు సింహాల అమ్మకం ఈ జూకి సాధారణమేనని ‘సమా టీవీ’ రిపోర్ట్ పేర్కొంది. గతేడాది 14 సింహాలను విక్రయించినట్టు పేర్కొంది. కాగా జాతి గేదెల ఖరీదు రూ.3.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య పలుకుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-07-30T01:33:04+05:30 IST