Indian Passport ఉంటే చాలు.. ఈ దేశాల్లో ఈజీగా ఉద్యోగం.. కాస్త డబ్బు చెల్లిస్తే Permanent Residence కూడా..!

ABN , First Publish Date - 2022-05-16T17:52:51+05:30 IST

విదేశాలకు వెళ్లాలని.. అక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడాలని సాధారణంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అందుకు కావాల్సిన ఆర్థిక స్థోమత లేదనే ఒకే ఒక్క కారణంతో తమ ఆశలను వదులుకుంటారు. అయితే ఇండియన్ పాస్‌పోర్ట్ ఉన్న వారికి కొన్ని దేశాల్లో సులభంగా ఉద్యోగాలు లభిస్తాయనీ..

Indian Passport ఉంటే చాలు.. ఈ దేశాల్లో ఈజీగా ఉద్యోగం.. కాస్త డబ్బు చెల్లిస్తే Permanent Residence కూడా..!

ఎన్నారై డెస్క్: విదేశాలకు వెళ్లాలని.. అక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడాలని సాధారణంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అందుకు కావాల్సిన ఆర్థిక స్థోమత లేదనే ఒకే ఒక్క కారణంతో తమ ఆశలను వదులుకుంటారు. అయితే ఇండియన్ పాస్‌పోర్ట్ ఉన్న వారికి కొన్ని దేశాల్లో సులభంగా ఉద్యోగాలు లభిస్తాయనీ.. ఆయా దేశాల పౌరసత్వం కూడా ఈజీగానే పొందొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం కొంత ఆశ్చర్యం కల్గించినా ఇది నిజం. ఆ దేశాల జాబితాపై ఓ లుక్కేస్తే..



ఆస్ట్రియా(Austria).. ఈ దేశం చిన్నదేశమే అయినప్పటికీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కొంత మొత్తంతో ఇక్కడ లైఫ్‌ను హ్యాపీగా లీడ్ చేయవచ్చు. పెద్దగా శ్రమించకుండానే ఇండియన్ పాస్‌పోర్ట్ ఆధారంగా ఈ దేశ పౌరసత్వాన్ని పొందొచ్చు. అయితే తొలుత D visa కేటగిరీ కింద తొలిత ఆరు నెలల పాటు అక్కడ నివసించేందుకు అనుమతులు తీసుకుని ఆ తర్వాత పర్మినెంట్ రెసిడెన్సీ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 



శీతల ప్రాంతాల్లో మీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే.. బెల్జియం (Belgium) బెటర్ ఆప్షన్. అయితే ఇక్కడ జీవన వ్యయం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఏ మాటకామాటే గానీ ఇక్కడ Food చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అక్కడికి వెళితే.. తిరిగి రావాలనిపించదు. ఇక అసలు విషయానికి ఇక్కడ జాబ్ పొందిన తర్వాత కొంత మొత్తంలో డబ్బులు చెల్లించి.. ఆ దేశ Permanent Citizenship పొందొచ్చు.



ఈక్వెడార్( Ecuador).. ఈ సౌత్ అమెరికాలో దేశంలో సిటిజన్‌షిప్ పొందడం ఈజీ. అక్కడ నివసించడానికి ఎటువంటి Age limit లేదు.. అదే విధంగా పెద్ద పెద్ద చట్టాలు కూడా ఉండవు. మీ నెల వారీ సంపాదన 800డాలర్లు ఉన్నట్టు నిరూపించుకుంటే చాలు ఈ దేశ సిటిజన్‌షిప్ పొందొచ్చు. పదవీ విరమణ పొంది వృద్ధాప్య జీవితాన్ని ఆనందంగా గడపాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. 



మధ్య అమెరికా దేశమైన బెలిజ్(Belize)‌లో జీవన వ్యయం (Cost of Living) చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు ఇంగ్లిష్ మాట్లాడతారు. 30 రోజుల విజిట్ వీసాపై ఈ దేశానికి వెళ్లిన తర్వాత ఆ గడువును ఎంత కాలం కావలిస్తే అంతకాలం పొడగించుకునే సౌలభ్యం అక్కడ ఉంది. జీవితాంతం అక్కడే ఉండాలనుకుంటే... కేవలం 1000 డాలర్లతోపాటు కొన్ని డాక్యుమెంట్లను సమర్పిస్తే సరిపోతుంది. 



కోస్టా రికా (Costa Rica).. ఇది కూడా మధ్య అమెరికా దేశమే. Biodiversityకి ఈ దేశం ప్రపంచంలోనే ఫేమస్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ దేశంలోని బీచ్‌లు, రిసార్టులు ఆకర్షణీయంగా ఉంటాయి. Indian Passport ఉంటే.. ఈ దేశంలో ఉండేందుకు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా సులభంగానే Job జాబ్ పొందొచ్చు.


Updated Date - 2022-05-16T17:52:51+05:30 IST