గూగుల్‌ క్రోమ్‌ సేవ్డ్‌ పాస్‌వర్ట్‌లు చూడొచ్చు

ABN , First Publish Date - 2021-03-06T06:00:54+05:30 IST

పీసీ లేదంటే ఆండ్రాయిడ్‌పై పని చేసుకుంటున్న సమయంలో వేర్వేరు వెబ్‌సైట్‌లు కనిపిస్తుంటాయి. అథెంటికేషన్‌ కోసం ఈమెయిల్‌ అడ్రస్‌, పాస్‌వర్డ్‌ని అవి నింపమంటూ ఉంటాయి

గూగుల్‌ క్రోమ్‌ సేవ్డ్‌ పాస్‌వర్ట్‌లు చూడొచ్చు

పీసీ లేదంటే ఆండ్రాయిడ్‌పై పని చేసుకుంటున్న సమయంలో వేర్వేరు వెబ్‌సైట్‌లు కనిపిస్తుంటాయి. అథెంటికేషన్‌ కోసం ఈమెయిల్‌ అడ్రస్‌, పాస్‌వర్డ్‌ని అవి నింపమంటూ ఉంటాయి. భవిష్యత్తులో సౌలభ్యంగా ఉండేందుకు మనం కూడా వాటిని నింపుతూ ఉంటాం. దాంతో అదే వెబ్‌సైట్‌ను తిరిగి ఓపెన్‌ చేసినప్పుడు వాటిని మళ్ళీ నింపాల్సిన అవసరం ఉండదు. అయితే మనం పెట్టిన పాస్‌వర్డ్‌తో అప్పటికే వెబ్‌సైట్‌ యాక్సెస్‌ ఉంటే ఏం చేయాలన్నది ప్రశ్న. అలాంటి సమయంలో గూగుల్‌ క్రోమ్‌లో సేవ్‌ చేసిన పాస్‌వర్డ్‌లను https:// passwords.google.com/వెబ్‌సైట్‌లో చూడవచ్చు. సేవ్‌ చేసిన పాస్‌వర్డ్‌తో ఉన్న అకౌంట్ల జాబితా అందులో కనిపిస్తుంది.


క్రోమ్‌లో మనం సేవ్‌ చేసిన పాస్‌వర్డ్‌ను చూసుకోవడం ఎలా? 

  • క్రోమ్‌ యాప్‌ కుడివైపు ఎగువ భాగంలో త్రీ వెర్టికల్‌ డాట్స్‌పై టాప్‌ చేయాలి
  • ‘సెట్టింగ్స్‌’ను టాప్‌ చేసి ‘పాస్‌వర్డ్స్‌’ని సెలెక్ట్‌ చేయాలి
  • పాస్‌వర్డ్‌ల జాబితాకు తోడు వెబ్‌సైట్‌లు, యూజర్‌నేమ్‌లు కనిపిస్తాయి.
  • ఇప్పుడు పాస్‌వర్డ్‌ కోసం ఐ ఐకాన్‌ను టాప్‌ చేయాలి.

Updated Date - 2021-03-06T06:00:54+05:30 IST