ఎపిక్‌ కార్డులేని వారు గుర్తింపుకార్డుతో ఓటు వేయవచ్చు

ABN , First Publish Date - 2021-03-09T05:55:14+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషన సూచించిన మేరకు మున్సిపల్‌ ఎన్నికల్లో ఎపిక్‌ కార్డులేని వారు ఏదైనా గుర్తింపు కార్డుతో తమ ఓటు హక్కును వినియోగించు కోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు,

ఎపిక్‌ కార్డులేని వారు  గుర్తింపుకార్డుతో ఓటు వేయవచ్చు

కలెక్టర్‌ సి.హరికిరణ్‌

కడప(కలెక్టరేట్‌), మార్చి 8: రాష్ట్ర ఎన్నికల కమిషన సూచించిన మేరకు మున్సిపల్‌ ఎన్నికల్లో ఎపిక్‌ కార్డులేని వారు ఏదైనా గుర్తింపు కార్డుతో తమ ఓటు హక్కును వినియోగించు కోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స, పాన కార్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్‌ సెక్టార్‌, స్థానిక సంస్థలు లేదా పబ్లిక్‌ లిమిటెడ్‌ సంస్థలు జారీ చేసిన గుర్తింపుకార్డు, పెన్షన డాక్యుమెంట్‌ పత్రం, పేమెంట్‌ ఆర్డర్‌ పత్రం, రిటైర్డ్‌ ఆర్మీ పెన్షన ఆర్డర్‌, వృద్ధాప్య, వితంతు పెన్షన కార్డులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. పాస్‌ బుక్‌, భూమి పట్టా, బ్యాంకులు, పోస్టల్‌, ఆప్కాబ్‌, కిసానక్రెడిట్‌ కార్డులు, రేషన కార్డు, అధికారి జారీ చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువీకరణ పత్రాలను సైతం అనుమతిస్తామని తెలిపారు. ఈ కార్డులపై ఫొటో గుర్తింపు తప్పని సరిగి ఉండాలని కలెక్టర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2021-03-09T05:55:14+05:30 IST