వైద్యం అందించాలంటే వాగు దాటాల్సిందే!

ABN , First Publish Date - 2021-07-25T05:57:43+05:30 IST

మండలంలోని జెండాగూడ, తొడసంగూడ గిరిజనులకు వైద్యం అందించాలంటే వాగు దాటాల్సిందే. ప్రతియేటా వర్షాకాలంలో జెండాగూడ వాగులో నీరు నిల్వ ఉండడంతో తప్పనిసరి పరిస్థితిల్లో వాగు దాటాల్సి వస్తుంద ని వైద్యసిబ్బంది పేర్కొంటున్నారు. చెరువుగూడ జీపీ పరిధిలో ఉన్న జెండాగూడ, తొడసంగూడ గిరిజనుల చిన్నారులకు శనివారం నాటు టీకాలు

వైద్యం అందించాలంటే వాగు దాటాల్సిందే!
వాగులో నుంచి వెళ్తున్న వైద్య సిబ్బంది

ఉట్నూర్‌, జూలై 24: మండలంలోని జెండాగూడ, తొడసంగూడ గిరిజనులకు వైద్యం అందించాలంటే వాగు దాటాల్సిందే. ప్రతియేటా వర్షాకాలంలో జెండాగూడ వాగులో నీరు నిల్వ ఉండడంతో తప్పనిసరి పరిస్థితిల్లో వాగు దాటాల్సి వస్తుంద ని వైద్యసిబ్బంది పేర్కొంటున్నారు. చెరువుగూడ జీపీ పరిధిలో ఉన్న జెండాగూడ, తొడసంగూడ గిరిజనుల చిన్నారులకు శనివారం నాటు టీకాలు అందించాల్సిన అవసరం ఉండడంతో గ్రామానికి చెందిన ఆశ వర్కర్‌ అయ్యూబాయితో కలిసి ఏఎన్‌ఎంలు పావని, అనసూయలు వాగులో మోకాలి లోతు వరకు నీళ్లు ఉన్న సాహసం చేస్తు గ్రామానికి చేరుకొని చిన్నారులకు టీకాలు వేశా రు. పుట్టిన పిల్లలకు సకాలంలో టీకాలు అందించకపోతే ఇతర రు గ్మతలు వస్తాయని వారు పే ర్కొన్నారు. వాగులో నుంచి వెళ్లి వైద్యం అందించిన సిబ్బందిని పలువురు అభినందించారు.

Updated Date - 2021-07-25T05:57:43+05:30 IST