బద్ధకస్తులకు బంపరాఫర్.. అలాంటి వారికే ఉద్యోగాలు ఇస్తారట.. వైరల్ అవుతున్న ప్రకటన

Published: Fri, 01 Jul 2022 20:54:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బద్ధకస్తులకు బంపరాఫర్.. అలాంటి వారికే ఉద్యోగాలు ఇస్తారట.. వైరల్ అవుతున్న ప్రకటన

సాధారణంగా ఏ కంపెనీ అయినా తెలివైన వారికి, చురుకైన వారికి ఉద్యోగాలు ఇస్తుంది. విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవం పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులను ఎంచుకుంటుంది. అయితే ఓ యజమాని మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. తమ దగ్గర పనిచేయడానికి ఎలాంటి డిగ్రీలు, నైపుణ్యాలు అక్కర్లేదని,  కేవలం బద్ధకస్తులైతే చాలని ప్రకటించాడు. 


`మీరు బద్ధకంగా, నిత్యం అసంతృప్తితో ఉండాలి. అలాగైతే ఇప్పటికే ఇక్కడ ఉన్న సిబ్బందితో కలిసిపోగలరు. మీకు అలాంటి లక్షణాలు ఉంటే బయోడేటా పట్టుకుని రండి. వచ్చే ముందు తప్పకుండా స్నానం చేసి రండి` అని ఓ దుకాణం ముందు బోర్డు పెట్టారు. ఆ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రకటనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. `ఇదే నా డ్రీమ్ జాబ్` అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. `నేను చాలా బద్ధకస్తుడిని, ఇంటర్వ్యూకు కూడా రాలేన`ని మరో వ్యక్తి పేర్కొన్నాడు. `నా అర్హతలకు తగిన జాబ్` అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.