ఈ గేదెను చూస్తే.. మనుషుల కంటే జంతువులే నయం అంటారు.. తాబేలుకు ఆ గేదె ఎలా సాయం చేసిందో చూస్తే ఆశ్యర్యపోతారు..

Published: Sat, 18 Dec 2021 20:16:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఈ గేదెను చూస్తే.. మనుషుల కంటే జంతువులే నయం అంటారు.. తాబేలుకు ఆ గేదె ఎలా సాయం చేసిందో చూస్తే ఆశ్యర్యపోతారు..

ప్రస్తుత సమాజంలో మనుషులు స్వార్థపూరితంగా తయారయ్యారు. సాటి మనుషుల పట్ల అభిమానం చూపించడం పక్కనపెట్టి.. మోసాలు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. మానవత్వం చూపిండంలో ఒక్కోసారి మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తూ ఉంటుంది. సాటి జంతువుల పట్ల అవి చూపించేంత ప్రేమాభిమానాలు.. మనుషుల్లో మచ్చుకైనా కనబడవు. అందుకే అప్పుడప్పుడూ కొందరిని చూసినప్పుడు.. మీకంటే జంతువులు నయం అని అంటూ ఉంటారు. ఎన్నో జంతువులు సాటి జంతువులకు సాయం చేయడం చూస్తుంటాం. ప్రస్తుతం ఓ గేదె కూడా అందుకు సాక్షంగా నిలుస్తోంది. తన కంటే ఎంతో చిన్నదైన తాబేలుకు ఎలా సాయం చేసిందో చూస్తే.. ఆశ్చర్యపోతారు..

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. మనుషుల్లో అంతరించిపోతున్న మానవత్వాన్ని.. చాలా సార్లు జంతువుల్లో చూస్తుంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ గేదె తనకంటే చాలా చిన్నదైన తాబేలుకు ఎంతో కష్టపడి సాయం చేస్తుంది. ఓ చెట్టు కింద తాబేలు వెల్లకిలా పడి ఉంటుంది. అక్కడి నుంచి వెళ్లేందుకు అది ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ సాధ్యం కాక సతమతమవుతూ ఉంటుంది. ఈలోగా ఓ గేదె దాన్ని గమనిస్తుంది. అంతటితో ఆగిపోకుండా, తాబేలు దగ్గరికి వచ్చి.. దాని సరైన స్థితికి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది.

ఏనుగులు కూడా కామెడీ చేస్తాయా.. ఈ మహిళను ఏనుగు ఎలా ఆట పట్టిస్తుందో మీరే చూడండి..

తొలుత విఫలమైనా పట్టు వదలకుండా, తాబేలుకు ఎలాంటి గాయం కాకుండా.. కొమ్ములతో సుతిమెత్తగా పైకి తిప్పుతుంది. దీంతో ఆ తాబేలు అక్కడి నుంచి క్షేమంగా వెళ్లడం మనం చూడొచ్చు. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా మనుషుల కంటే ఈ గేదె ఎంతో నయం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. సాటి మనిషి కష్టాల్లో ఉంటే.. మనకెందుకులే అని అనుకునే మనుషులు.. ఈ గేదెను చూసి నేర్చుకోవాలంటూ సూచిస్తున్నారు.

ఈ చింపాంజీల తెలివి మామూలుగా లేదుగా.. కారును ఎంత శ్రద్ధగా శుభ్రం చేస్తున్నాయో చూడండి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

బాత్రూమ్‌లో మరమ్మతు పనులు చేస్తున్న ప్లంబర్.. గోడలో ఏదో ఉన్నట్లు అనుమానం.. తీరా బద్దలు కొట్టి చూడగా.. అదొక ఖరీదైన బంగళా.. లోపల కిచెన్‌ నుంచి సీక్రెట్ గదులకు ప్రత్యేక మార్గం.. మనసు బాలేనప్పుడల్లా ఆ యువతి అక్కడికే వెళ్తుందట..videoవృద్ధురాలైన తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి.. మత్తులోకి వెళ్లాక ఈ కొడుకు చేసిన నీచమిది.. ఏం జరిగిందో ఆలస్యంగా ఆమె గ్రహించి..దుప్పట్లో చుట్టి.. పక్కన ఓ వాటర్ బాటిల్ పెట్టి.. రెండేళ్ల చిన్నారిని రాత్రిపూట బస్టాండ్‌లో వదిలేశారు.. చివరకు..ప్రేమ పెళ్లికి పెద్దలు నో.. ఒప్పించేందుకు ఫ్రెండ్స్‌తో ఆ కుర్రాడు చెప్పించిన అబద్ధం.. ప్రేయసి ప్రాణం తీసింది.. అసలేం జరిగిందంటే..41 ఏళ్ల తర్వాత అత్యాచారం కేసులో ప్రారంభమయిన విచారణ.. ప్లీజ్.. ఆపేయండంటూ లేఖ రాసిన బాధితురాలు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.