చింపిరి జుట్టు వాళ్లు.. ఇట్టాంటట్టాంటోళ్లు కాదు బాబోయ్...

ABN , First Publish Date - 2022-08-04T13:49:03+05:30 IST

చింపిరి జుట్టు వాళ్లు.. ఇట్టాంటట్టాంటోళ్లు కాదు బాబోయ్...

చింపిరి జుట్టు వాళ్లు.. ఇట్టాంటట్టాంటోళ్లు కాదు బాబోయ్...

ఎక్కడైనా డీజే ట్యూన్‌లకు డ్యాన్స్ చేసే వారిని చూసివుంటాం. అంతేగానీ డీజే ట్యూన్స్‌కు రెండు గ్రూపులు గొడవపడటాన్ని ఎప్పుడైనా చూశారా? అదికూడా ఆ రెండు గ్రూపులలోనూ అమ్మాయిలే ఉండటం విశేషం. సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు తమతమ గ్రూపులతో కొట్టుకోవడం కనిపిస్తుంది. ఈ సందర్భంగా డీజే సంగీతం కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంటుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మాయిలు ఒకరి జుట్టు మరొకరు లాక్కుంటూ విచక్షణారహితంగా కొట్టుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్న కొందరు వీరి కొట్లాటను ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 




ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా అమ్మాయిలు కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. ఈ గొడవకు కారణం మాత్రం తెలియరాలేదు. అక్కడ ఉన్న ఎవరో ఈ గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీడియోను పోస్ట్ చేస్తూ, @Chandan18029052 అనే యూజర్ క్యాప్షన్‌లో ఇలా రాశారు... 'డీజేలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు అమ్మాయిలు గొడవపడ్డారు.. జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. అని రాశారు. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో గల బిష్రాంపూర్ ప్రాంతానికి సంబంధించిన ఈ వీడియోను అత్యధికులు లైక్ చేయగా, పలువురు షేర్ చేస్తున్నారు.

Updated Date - 2022-08-04T13:49:03+05:30 IST