యువకుడి సరదా తీర్చిన నాగుపాము.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో!

Published: Thu, 17 Mar 2022 17:32:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
యువకుడి సరదా తీర్చిన నాగుపాము.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: విష సర్పాలను పట్టుకోవడం, వాటితో రకరకాల విన్యాసాలు చేయడం అంటే ఆ యువకుడికి సరదా. చివరికి ఆ సరదానే అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రస్తుతం ఆ యువకుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్త వివరాల్లోకి వెళితే..


కర్నాటకలోని సిర్సీకి చెందిన మాజ్ సయ్యద్‌ విష సర్పాలను చాకచక్యంగా పట్టగలడు. అలా పట్టిన పాములతో రకరకాల విన్యాసాలు చేయడం అతడికి సరదా. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు. పాములతో విన్యాసాలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే మాజ్ సయ్యద్.. తాజాగా వేరు వేరు సైజుల్లో ఉన్న మూడు నాగుపాములతో విన్యాసాలు చేస్తూ.. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్నాడు. కాళ్లను అటూ ఇటూ కదుపుతూ.. వాటిని ఆడించేందుకు ట్రై చేశాడు. కానీ ప్రయోగం విఫలమైంది. మూడింట్లో ఓ పాము అమాంతం ఎగిరి.. అతడి కాలుపై కరిసింది. దీంతో ఒక్కసారిగా షాకైన అతడు.. ఎలాగోలా వాటి నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ వీడియోను ఓ ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ‘విష సర్పాలతో ఆటలేంటి’ అంటూ సయ్యద్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 




Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.