Young engineer: పెళ్ళికోసం దాచిన సొమ్ముతో సిమెంట్‌ రోడ్డు

ABN , First Publish Date - 2022-08-26T16:12:13+05:30 IST

తన స్వగ్రామంలో 25 యేళ్లుగా పాలకులు పట్టించుకోని ఓ వీధిలో సిమెంట్‌ రోడ్డు వేయడానికి చెన్నైలోని ప్రైవేటు సంస్థ లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న

Young engineer: పెళ్ళికోసం దాచిన సొమ్ముతో సిమెంట్‌ రోడ్డు

                                         - యువ ఇంజనీర్‌ వితరణ


చెన్నై, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): తన స్వగ్రామంలో 25 యేళ్లుగా పాలకులు పట్టించుకోని ఓ వీధిలో సిమెంట్‌ రోడ్డు వేయడానికి చెన్నైలోని ప్రైవేటు సంస్థ లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువకుడు నడుంబిగించాడు. ఎన్నో ఏళ్లుగా మిట్టాపల్లాలుగా ఉన్న ఈశ్వరన్‌కోవిల్‌ వీథిలో తన సొంత ఖర్చులతో సిమెంట్‌ రోడ్డు నిర్మించి స్థానికుల ప్రశంసలందుకున్నాడు. విల్లుపురం జిల్లా(Villupuram District) వానూరు సమీపం నాల్లావూరు గ్రామానికి చెందిన చంద్రశేఖరన్‌ చెన్నైలోని హెచ్‌సీఎల్‌ సంస్థలో టెక్నికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తరచూ సెలవులకు స్వగ్రామానికి వెళ్ళి వస్తుంటాడు. ఆ సమయంలో తమ గ్రామంలోని ఈశ్వరన్‌కోవిల్‌ వీధి దుస్థితిలో ఉండటాన్ని గమనించారు. ఆ వీధికి సిమెంట్‌ రోడ్డు(Cement road) వేయాలంటూ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. చివరకు తన సొంత ఖర్చుతో సిమెంట్‌ రోడ్డు వేయాలనుకున్నాడు. ఆ మేరకు తన పెళ్ళికోసం పొదుపు చేసిన రూ.9.5 లక్షలతో జిల్లా అధికారుల సహకారంతో ఆ వీధిలో సిమెంట్‌  రోడ్డు నిర్మించాడు. ఆ రోడ్డును చూసి స్థానికులు చంద్రశేఖరన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ విషయమై చంద్రశేఖరన్‌(Chandrasekaran) మాట్లాడుతూ తన వివాహం కోసం పొదుపు చేసిన నగదును ఖర్చు చేయడానికి తల్లిదండ్రులు సంతోషంగా అంగీకరించారని చెప్పారు. ప్రస్తుతం ఆ సిమెంట్‌ రహదారిని చూసినప్పుడల్లా తనకు చెప్పలేనంత ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Updated Date - 2022-08-26T16:12:13+05:30 IST