ఒక్క ఫొటోతో సోషల్ మీడియానే షేక్ చేసింది.. ఈ 11 ఏళ్ల పాప సంకల్పం చూసి ఏకంగా ముఖ్యమంత్రే..

Published: Tue, 05 Apr 2022 21:26:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఒక్క ఫొటోతో సోషల్ మీడియానే షేక్ చేసింది.. ఈ 11 ఏళ్ల పాప సంకల్పం చూసి ఏకంగా ముఖ్యమంత్రే..

చిన్న పిల్లల్లో చాలా మంది చదవాలంటేనే బద్ధకిస్తారు. ఏవేవో సాకులు చెప్పి పాఠశాలకు డుమ్మా కొట్టాలనే చూస్తారు. అయితే పెద్దల బలవంతం మీద వెళ్తూ ఉంటారు. కానీ, కొందరు పిల్లలు మాత్రం చిన్నతనం నుంచే చాలా చురుకుగా ఉంటారు. చదువులో అందరికంటే ముందుంటూనే ఇంటి పనుల్లోనూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటారు. అయితే 11ఏళ్ల వయసున్న పిల్లల్లో ఇలాంటి లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే 11ఏళ్ల చిన్నారి సంకల్పం చూసి ఏకంగా మణిపూర్ సీఎం కూడా చలించిపోయారు. వివరాల్లోకి వెళితే..

ఒక్క ఫొటోతో సోషల్ మీడియానే షేక్ చేసింది.. ఈ 11 ఏళ్ల పాప సంకల్పం చూసి ఏకంగా ముఖ్యమంత్రే..

ఉత్తర మణిపూర్‌లోని తమెంగ్‌లాంగ్ జిల్లాకు చెందిన దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె అయిన మానింగ్‌సిలియు అనే బాలిక నాలుగో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో 11ఏళ్ల మానింగ్‌సిలియు... చెల్లెళ్ల ఆలనాపాలనా చూసుకుంటూ ఉండేది. మానింగ్‌సిలియుకు చదువంటే ఎంతో శ్రద్ధ. ఒక్క రోజు కూడా పాఠశాలకు సెలవు పెట్టేది కాదు. పాఠశాలకు వెళ్లే సమయంలో తన రెండేళ్ల చెల్లెలిని ఎత్తుకెళ్లి.. క్లాసులో తన ఒళ్లో కూర్చోబెట్టుకుని మరీ పాఠాలు వినడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఓవైపు చెల్లెలి ఆలనాపాలనా చూస్తూనే.. మరోవైపు చదువును కూడా అశ్రద్ధ చేయలేదు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ వార్త మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ దృష్టికి వెళ్లింది.

ఛాతిలో బుల్లెట్ దిగి చొక్కా నిండా రక్తంతో వైరల్‌‌గా మారిన ఈ బాలుడి ఫొటో వెనుక అసలు నిజం ఇదీ..!

ఒక్క ఫొటోతో సోషల్ మీడియానే షేక్ చేసింది.. ఈ 11 ఏళ్ల పాప సంకల్పం చూసి ఏకంగా ముఖ్యమంత్రే..

చిన్నారి సంకల్పానికి చలించిన సీఎం... ఆదివారం చైల్డ్‌లైన్ సేవా బృందాన్ని వారి గ్రామానికి పంపించారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద బాలిక కుటుంబాన్ని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడంతో పాటు తక్షణ ఉపశమనంగా వారికి రేషన్, రూ.10,000 ఆర్థిక సాయం అందించారు. మరోవైపు మంత్రి బిస్వజిత్ సింగ్ స్పందిస్తూ.. బాలిక డిగ్రీ వరకు చదివేందుకు అయ్యే ఖర్చంతా భరిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ విద్య పట్ల ఆమెకున్న అంకితభావం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. బాలికను అభినందిస్తూ మంత్రి పేస్‪‌బుక్‌లో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

నాలుగేళ్లుగా వీడని మిస్టరీ.. ఇంతకీ ఈ 24 ఏళ్ల యువతి ఏమైపోయింది..? అసలేం జరిగిందంటే..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

కొత్త కోడలు చెప్పిందని రోజూ రాత్రి పాలు తాగుతున్న కుటుంబ సభ్యులు.. మూడో రోజు పొద్దున్నే లేచి చూస్తే..Viral Video: కూరలో కావాలనే ఉప్పు ఎక్కువగా కలిపి టేస్ట్ చూడమన్న భార్య.. ఆ భర్త రియాక్షన్‌కు నెటిజన్లు ఫిదాvideoరాత్రి వేళ ప్రజలు ఉగాది వేడుకల్లో ఉండగా.. ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు.. ఉన్నట్టుండి భూమిపై పడిన వస్తువులు చూసి..గుర్తు తెలీని అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్.. సరదాగా చాటింగ్ మొదలు పెట్టాడు.. కానీ చివరకు షాకింగ్ ట్విస్ట్..ఒక్క ఫోన్‌తో ప్రయాణికులను హడలెత్తించిన 12 ఏళ్ల పిల్లాడు.. ఎందుకిలా చేశావని రైల్వే పోలీసులు నిలదీస్తే.. వ్యభిచారం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న భర్త.. పోలీసులకు పట్టుబడ్డ మహిళ.. అతడి భార్యే అని తెలిసి..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.